జలవనరుల శాఖను పునర్వ్యవస్థీకరిస్తూ టీ.సర్కార్ ఉత్తర్వులు
ABN , First Publish Date - 2020-12-29T15:13:50+05:30 IST
రాష్ట్ర జలవనరుల శాఖను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: రాష్ట్ర జలవనరుల శాఖను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిన్న జలవనరుల శాఖపై ప్రగతి భవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల రంగంలో చోటు చేసుకుంటున్న పెను మార్పులకు అనుగుణంగా జలవనరుల శాఖ ప్రక్షాళన జరిగింది. ఆ శాఖలో కొత్తగా 945 పోస్టులను సృష్టించారు. రాష్ట్రంలో 19 ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేసి... ప్రతి ప్రాదేశిక ప్రాంతానికి ఒక సీఈని నియమించనున్నారు. అలాగే జలవనరుల శాఖలో అదనంగా మరో మూడు ఈఎన్సీ పోస్టులను సృష్టించారు.