శనివారం రూట్‌ మార్చుకోండి

ABN , First Publish Date - 2020-11-27T06:10:04+05:30 IST

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఎల్‌బీ స్టేడియం

శనివారం రూట్‌ మార్చుకోండి

ట్రాఫిక్‌ ఆంక్షలు విధించిన పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఎల్‌బీ స్టేడియంలో జరగనున్న టీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు హాజరు కానున్న నేపథ్యంలో మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 8గంటల వరకు స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు. బందోబస్తుతో పాటు ట్రాఫిక్‌కు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 

ట్రాఫిక్‌ ఆంక్షలు ఇవి.. 

శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్టేడియం పరిసరాల్లో వాహనాలకు అనుమతి ఉండదు. ఆయా ప్రాంతాలలో తిరిగే వాహనాలను మళ్లించి ప్రత్యామ్నాయ దారుల ద్వారా పంపిస్తారు.  

ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ జంక్షన్‌ వద్ద నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి, చాపెల్‌రోడ్‌, రవీంద్రభారతి వైపు అనుమతిస్తారు. 

ఆబిడ్స్‌, గన్‌ఫౌండ్రి వైపు నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రి, చాపెల్‌రోడ్‌ వైపు మళ్లిస్తారు.

బషీర్‌బాగ్‌ నుంచి జీపీఓ, ఆబిడ్స్‌ వైపు వెళ్లే వాహనదారులు బషీర్‌బాగ్‌ జంక్షన్‌ నుంచి హైదర్‌గూడ, కింగ్‌కోఠి రోడ్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది. 

ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనదారులను హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ వైపు అనుమతిస్తారు. 

లిబర్టీ నుంచి బషీర్‌బాగ్‌ వచ్చే వాహనాలను లిబర్టీ క్రాస్‌రోడ్స్‌ నుంచి మళ్లిస్తారు.

పోలీస్‌ కంట్రోల్‌ రూం నుంచి బషీర్‌బాగ్‌ జంక్షన్‌ వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్‌ నుంచి లిబర్టీ వైపు అనుమతిస్తారు.

పార్కింగ్‌

సికింద్రాబాద్‌ వైపు నుంచి వాహనాల్లో వచ్చే వారు ఎల్‌బీ స్టేడియం జీ గేటు వద్ద దిగాలి. వాహనాలను పబ్లిక్‌గార్డెన్‌, రవీంద్రభారతి, ఐమాక్స్‌ పక్కన డా. కార్స్‌ పార్కింగ్‌లో పార్క్‌ చేయాలి. 

ఎల్‌బీనగర్‌, దిల్‌సుక్‌నగర్‌, మెహదీపట్నం, పాతబస్తీ ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే వారు ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ వద్ద దిగాల్సి ఉంటుంది.   వాహనాలను పబ్లిక్‌గార్డెన్‌ లోపల, పీపుల్స్‌ ప్లాజాలో పార్క్‌ చేయాలి. 

ముషీరాబాద్‌, అంబర్‌పేట్‌, హిమాయత్‌నగర్‌ వైపు నుంచి వాహనాల్లో వచ్చేవారు ఎల్‌బీ స్టేడియం ఎఫ్‌, ఎఫ్‌-1 గేట్ల వద్ద దిగాలి. వాహనాలను నిజాం కాలేజ్‌ గ్రౌండ్స్‌లో పార్క్‌ చేయాలి. 

మెహదీపట్నం వైపు నుంచి వాహనాల్లో వచ్చే వారు ఎల్‌బీస్టేడియం జీ గేటు వద్ద దిగాలి. నిజాం కాలేజీ గ్రౌండ్‌లో వాహనాలను పార్క్‌ చేయాలి.

Read more