ఇల్లే పాఠశాల..

ABN , First Publish Date - 2020-04-14T10:52:32+05:30 IST

కరోనా వైరస్‌.. పిల్లల భద్రత పరంగా భారీ ఆందోళనలనే తీసుకొచ్చింది. స్కూల్స్‌ నడిచినన్ని రోజులూ ఆ

ఇల్లే పాఠశాల..

ఎలకా్ట్రనిక్‌ డివైజ్‌లే గురువులు 

ఆన్‌లైన్‌ బాటపట్టిన విద్యావ్యవస్థ

డిజిటల్‌ మార్గంలో స్టూడెంట్స్‌తో కనెక్ట్‌ అవుతున్న టీచర్లు

డాటా సమస్యలున్నా పిల్లలు ఎంజాయ్‌ చేస్తున్నారంటున్న ప్రిన్సిపాల్స్‌


కొవిడ్‌-19 కారణంగా దాదాపు నెలరోజులు విద్యార్థులకు సెలవులొచ్చాయి. చాలా మందికి అసలు పరీక్షలే జరగలేదు. పబ్లిక్‌ పరీక్షలూ వాయిదా పడ్డాయి. ముందే వేసవి సెలవులు వచ్చాయని విద్యార్థుల ఆనందం... కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఇళ్ల నుంచి బయటకు వెళ్లనీయకుండా వారి అల్లరి ఎలా భరించాలోనంటూ తల్లిదండ్రుల భయం... అవేమీ కనిపించడం లేదిప్పుడు. వర్కింగ్‌ పేరెంట్స్‌ తమ రూమ్స్‌లో బిజీగా ఆఫీసు పనులు చేసుకుంటూ ఉంటే.. వారి పిల్లలు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు లేదంటే ల్యాప్‌టా్‌పలలో ఇంకా బిజీగా గడుపుతున్నారు. అలాగని కార్టూన్‌ చానెల్స్‌ లేదంటే వీడియో గేమ్‌లు ఆడుతూ కాదు... పై క్లాస్‌ సిలబస్‌ నేర్చుకుంటూ..! 


నిజమే... పిల్లలు ఇప్పుడు తమ క్లాస్‌ సబ్జెక్ట్స్‌ నేర్చుకోవడానికి ఆన్‌లైన్‌ బాట పట్టారు. ఇప్పటికే కొన్ని పాఠశాలలు రాబోయే విద్యాసంవత్సరాన్ని ఆన్‌లైన్‌లో ప్రారంభించాయి. ఠంచన్‌గా క్లాస్‌రూమ్‌కు హాజరైనట్లుగా తమ గదిలోకి వెళ్లి ల్యాప్‌టాప్‌ ముందు కూర్చుని బుద్ధిగా క్లాస్‌కు హాజరవుతున్నారు విద్యార్థులు. లాక్‌డౌన్‌ వేళ డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు విద్యార్థులను బిజీగా మార్చేశాయి. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎ్‌సఈ), నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) లాంటి యాప్స్‌తో పాటు పలు ప్రైవేట్‌ పాఠశాలలు గుగూల్‌ క్లాస్‌రూమ్స్‌, జూమ్‌ మాధ్యమాలు ఉపయోగించుకుని తమ విద్యార్థులతో కనెక్ట్‌ అవుతున్నాయి. కొంతమంది వాట్సా్‌పలు, మెయిల్స్‌లో అసైన్‌మెంట్స్‌ పంపి విద్యార్థులతో ఇంటరాక్ట్‌ అవుతున్నారు. లాక్‌డౌన్‌ వేళ నగరంలో కనిపిస్తున్న నయా ధోరణి ఇది. 


స్టూడెంట్స్‌కు ఓకే... పేరెంట్స్‌ డబుల్‌ హ్యాపీ

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌13 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌.. పిల్లల భద్రత పరంగా భారీ ఆందోళనలనే తీసుకొచ్చింది. స్కూల్స్‌ నడిచినన్ని రోజులూ ఆ వ్యాధి బారిన పడకుండా తమ పిల్లలను కాపాడటం ఎలాగోనని ఆందోళన చెందిన తల్లిదండ్రులకు.. లాక్‌డౌన్‌ కారణంగా వారి విద్య ఏమవుతుందోనన్న బెంగనూ తీసుకొచ్చింది. వర్కింగ్‌ కపుల్స్‌కు అయితే ఇది మరింత ఆందోళన కలిగించింది. ఈ సమస్యలన్నింటికీ డిజిటల్‌ క్లాస్‌రూమ్‌తో చెక్‌ పెట్టాయి పాఠశాలలు. గుగూల్‌ క్లాస్‌ రూమ్‌లు, వాట్సాప్‌ అసైన్‌మెంట్స్‌తో స్టూడెంట్స్‌తో రోజంతా కనెక్ట్‌ అవుతున్నాయి. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, సెయింట్‌ పాల్స్‌, ప్రణవ్‌ఇంట్నేషనల్‌, లిటిల్‌ ఫ్లవర్‌, కెనడీ ఇంటర్నేషనల్‌.. ఒకటేమిటి నగరంలో చాలా పాఠశాలలు ఇప్పుడు డిజిటల్‌ బాటపట్టాయి. ఇదే విషయమై ప్రణవ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ జస్మీత్‌ మాట్లాడుతూ అవసరం నుంచే సృజన పుడుతుంది.


ఈ డిజిటల్‌ క్లాస్‌రూమ్‌ అందుకు మినహాయింపేమీ కాదన్నారు. వాస్తవం కూడా అంతే! గతంలో పిల్లలకు స్మార్ట్‌ఫోన్స్‌ లేదంటే ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌ అందిస్తే ఉపేక్షించని ఎన్నో పాఠశాలలు.. ఇప్పుడు వాటితో పిల్లలను ఎంగేజ్‌ చేయాలని కోరుతున్నాయి. ఈ క్లాస్‌రూమ్‌ల పట్ల పిల్లలు కూడా సంతోషంగానే ఉంటున్నారు. లోయర్‌ క్లాస్‌ చిన్నారులకు కథలు, పెయింటింగ్స్‌ రూపంలో అసైన్‌మెంట్స్‌ను ఇస్తుండడం, కాస్త పెద్ద తరగతుల పిల్లలకు తేలిగ్గా అర్థమయ్యేలా స్కైపీ లెసన్స్‌ ఇస్తుండటం వల్ల ఈ కొత్త తరహా బోధనను వారు ఆస్వాదిస్తున్నారు. ఈ తరహా బోధనను తల్లిదండ్రులు కూడా స్వాగతిస్తున్నారు. విద్యకు పూర్తిగా దూరం కావడం వల్ల పిల్లలు ఏమైపోతారోనన్న బెంగ తొలుత వచ్చింది కానీ.. ఇప్పుడు వారితో పాటు తమకూ నేర్చుకునే అవకాశం కలిగిందని ఓ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ రూపేష్‌ తెలిపారు.నేను పూర్తిగా ఎంజాయ్‌ చేస్తున్నా...

మా మామ్‌ మా మదర్‌ ఫోన్‌కు రోజూ అసైన్‌మెంట్‌ పంపుతున్నారు. వాటితో పాటు స్మాల్‌ లెస్సన్‌ వీడియోలు కూడా పంపుతున్నారు. రోజూ ఈ అసైన్‌మెంట్స్‌ను కంప్లీట్‌ చేయాలి. మా ఫాదర్‌, మదర్‌ ఇద్దరూ నాకు హెల్ప్‌ చేస్తున్నారు. ఐ లవ్‌ దిస్‌ లెర్నింగ్‌.

- పూజ్య మాదాల, రెండో తరగతి, ప్రణవ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, చింతల్‌


బిజీగా మారిపోయాం...

రోజూ మా టీచర్‌ నుంచి మమ్మీ ఫోన్‌కు అసైన్‌మెంట్స్‌ వస్తున్నాయి. అన్నీ కంప్లీట్‌ చేయాలి. స్కూల్‌ రీఓపెన్‌ కాగానే డేట్‌ వైజ్‌ వాటిని సబ్మిట్‌ చేయాలంట. ఆడుకోవడానికి టైమ్‌ ఉంటుంది కానీ హాలీడే్‌సలో ఎంజాయ్‌ చేసినంత కాదు.

- దర్శ్‌ గుప్తా, ఐదో తరగతి, సెయింట్‌పాల్స్‌ స్కూల్‌, హిమాయత్‌నగర్‌


కరోనాపై అసైన్‌మెంట్‌ ఇచ్చారు...

మా స్కూల్‌ హాలీడేస్‌ ఇచ్చినప్పటి నుంచి మాకు రోజూ అసైన్‌మెంట్స్‌ వస్తూనే ఉన్నాయి. లేటె్‌స్టగా కరోనాపై పెయింటింగ్‌ వేయమన్నారు. ఇదిగో ఇలా వేశా. రోజూ డిఫరెంట్‌ అసైన్‌మెంట్స్‌ ఉంటున్నాయి. ఐ ఎంజాయ్‌ ఏ లాట్‌.

- అజాన్‌ మిర్జా, మూడో తరగతి, లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌, ఆబిడ్స్‌


విద్యకు దూరం కాకుండా చేసే ప్రయత్నమే ఇదంతా...

మేము ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించడం లేదు కానీ.. అసైన్‌మెంట్స్‌ను గుగూల్‌ ఫార్మ్‌ రూపంలో పంపుతున్నాము. వీడియోల రూపంలో కూడా క్లాసెస్‌ చెబుతున్నాం. ప్రతి వీడియో 5 నిమిషాలు ఉంటుంది. ప్రైమరీ క్లాస్‌లకు రోజూ మూడు సబ్జెక్ట్‌లను చెబుతున్నాం. దీనిలో లెస్సన్‌ సమ్మరీ ఉంటుంది. దీనిని అనుసరించి అసైన్‌మెంట్స్‌ ఉంటాయి. తల్లిదండ్రుల మెయిల్స్‌కు ఈ లింక్‌లు వెళ్తుంటాయి. స్టూడెంట్స్‌ వాటిని చూసి ఆ ఫార్మ్స్‌ను డిజిటల్‌గా పూర్తి చేసి మరలా పంపాల్సి ఉంటుంది. దీనివల్ల టీచర్‌కు సైతం స్టూడెంట్‌ ఏం నేర్చుకున్నాడో ఎస్సెస్‌ చేసే వీలు కలుగుతుంది. విద్యకు దూరం కాకుండా చేసే ప్రయత్నమే ఇదంతా. 

- జస్మీత్‌, ప్రిన్సిపాల్‌, ప్రణవ్‌ స్కూల్‌


ఆన్‌లైన్‌ క్లాస్‌లకు 92 శాతం హాజరు...

తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఐసీఎ్‌ససీ ఐఎస్‌ నోటిఫికేషన్‌ ప్రకారం 1 నుంచి 8 తరగతుల విద్యార్థులను మేము నెక్ట్స్‌ క్లాస్‌లకు ప్రమోట్‌ చేశాం. ఇప్పుడు ఆన్‌లైన్‌లో క్లాస్‌లను నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకూ క్లాస్‌ 11, 12 తరగతులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లను నిర్వహించాం. ఇంట్లో ఎలకా్ట్రనిక్‌ డివైజెస్‌ అందుబాటులో ఉండాలి. లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లో టీచర్లు కూడా తమ పర్సనల్‌ వర్క్స్‌ చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్‌ ప్లాన్‌ చేశాం. ఈ ఆన్‌లైన్‌ క్లాస్‌లకు 92 శాతం హాజరు ఉంది. మా స్కూల్‌కు సొంత సోషల్‌ హ్యాండిల్స్‌ ఉన్నాయి. అలాగే కొన్ని సంస్థలతో ఒప్పందాలున్నాయి. కానీ క్లాస్‌రూమ్‌ను మించిన అనుభూతులను ఆన్‌లైన్‌ క్లాస్‌లు అందించలేవు. సమ్మర్‌ హాలీడే్‌సలో ఈ క్లాస్‌లు జరుగుతాయా అని అంటే.. బ్రేక్‌ ఇవ్వడమే మంచిదని నా అభిప్రాయం. 

- అమృత చంద్ర రాజు, వైస్‌ ప్రిన్సిపాల్‌, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, బేగంపేట


Updated Date - 2020-04-14T10:52:32+05:30 IST