టీడీపీ మహాధర్నా రేపు

ABN , First Publish Date - 2020-03-04T08:04:02+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర కమిటీ ఆధ్యర్యంలో ఈ నెల 5న ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ఎం.అరవింద్‌ కుమార్‌గౌడ్‌ వెల్లడించారు.

టీడీపీ మహాధర్నా రేపు

 ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ..రాంనగర్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర కమిటీ ఆధ్యర్యంలో ఈ నెల 5న ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ఎం.అరవింద్‌ కుమార్‌గౌడ్‌ వెల్లడించారు. మంగళవారం దోమలగూడలోని టీడీపీ నగర కార్యాలయంలో జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశం మాజీ చైర్మన్‌ పి.సాయిబాబా అధ్యక్షతన జరిగింది. ఇందులో ఎం.అరవింద్‌కుమార్‌గౌడ్‌, మాజీమంత్రి రావుల చంద్రశేఖర్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్బంగా అరవింద్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అనుమతితో త్వరలో జిల్లా కమిటీ వేస్తామని అన్నారు. మంత్రి కేటీఆర్‌ మాటల గారడీ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారని విమర్శించారు.


మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన ఆరు వార్షిక బడ్జెట్‌లో అన్ని వర్గాల ప్రజలకు సమతూకంలో నిధులు కేటాయించలేదని ఆరోపించారు. తమ అనుయాయులకు నూతన ప్రాజెక్ట్‌లు కట్టబెట్టి కమీషన్ల దందా కొనసాగిస్తున్నారని విమర్శించారు.  రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఇప్పటి నుంచి టీడీపీ ప్రజా ఉద్యమాలు చేపడుతుందని అన్నారు. త్వరలో పార్టీ హైదరాబాద్‌ జిల్లా కమిటీ, నియోజకవర్గం, డివిజన్‌ స్థాయి కమిటీలు వేసి పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామని అన్నారు.  సమావేశంలో టీడీపీ హైదరాబాద్‌ జిల్లా నాయకులు నల్లెల కిషోర్‌, బాల్‌రాజ్‌గౌడ్‌, మధుకర్‌, గంగాధర్‌గౌడ్‌, అశోక్‌, కుమరయ్య, రవీంద్రచారి, శ్రీనివా్‌సనాయుడు, రాజాచౌదరి, విజయశ్రీ, ఊర్మిళాదేవి, అన్నపూర్ణ, ఇందిర, ఎంకే బోసు, జహీరుద్దీన్‌ సమద్‌, రాంచందర్‌గుప్త, అంజాద్‌ఖాన్‌ పాల్గొన్నారు.   

Updated Date - 2020-03-04T08:04:02+05:30 IST