టీడీఎఫ్ ఆధ్వర్యంలో బ్రాహ్మణులకు నిత్యవసరాలు పంపిణీ

ABN , First Publish Date - 2020-05-24T18:46:13+05:30 IST

కోవిడ్ - 19 సహాయక కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలు ముందున్న విషయం తెలసిందే.

టీడీఎఫ్ ఆధ్వర్యంలో బ్రాహ్మణులకు నిత్యవసరాలు పంపిణీ

హైదరాబాద్: కోవిడ్ - 19 సహాయక కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలు ముందున్న విషయం తెలసిందే. దేశవిదేశాల్లో ఉన్న మనసున్న మారాజులు ఈ కార్యక్రమాలకు తమవంతు సాయాన్ని అందిస్తున్నారు. తాజాగా తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరానికి చెందిన యూఎస్ఏ విభాగం తమ సహాయ కార్యక్రమాన్ని నగరంలో పలు చోట్ల నిర్వహించింది. టీడీఎఫ్ యూఎస్ఏ అధ్యక్షురాలు కవిత చల్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రి, న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ వేణుగోపాలచారి హాజరయ్యారు. దాదాపు 200 బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యవసరాలు అందించారు. ఈ సందర్భంగా వేణుగోపాలచారి మాట్లాడుతూ, అమెరికాలో ఉంటున్న కవిత చల్లా, ఆమె స్నేహితులు, దాతలు ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అభినందిస్తున్నట్లు చెప్పారు. బ్రాహ్మణులకు రేషన్‍ కార్డులు కూడా లేవని, ఆలయాల మూసివేత, లాక్‍డౌన్‍ వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో వారిని ఆదుకునేందుకు టీడిఎఫ్‍ ముందుకు రావడం సంతోషకరమైన విషయమన్నారు. 


టీడిఎఫ్‍ ఇండియా ప్రెసిడెంట్‍ వట్టె రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి మట్ట రాజేశ్వర్‍ రెడ్డి ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. తాడ్‍బండ్‍లోని హనుమాన్‍ ఆలయం వద్ద ఉన్న వేణుగోపాలచారి గృహంలో, అల్వాల్‍లోని సూర్యనగర్‍లో ఉన్న సాయిబాబా ఆలయంలో, ఆనంద్‍బాగ్‍ వద్ద ఉన్న శంకర్‍మఠంలో, కేపీహెచ్‍బీ ఫేజ్‍ 4లో బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. 


ఈ కార్యక్రమానికి అమెరికాకు చెందిన దాతలు జయంత్‍, కవిత చల్లా కుటుంబం, డా. వెంకటేశ్వరరావు-స్మిత, రవి కిరణ్‍-పద్మ నంగునూరి, లక్ష్మీనరసింహరావు-కిరణ్మయి చేపూరి, డాక్టర్ వెంకటేశ్వర్‍ - సునీత అద్దంకి, రామచంద్రారెడ్డి - అనిల, నరేందర్‍రావు-షీలారెడ్డి, వెంకట్‍ నరసింహ-దీపిక వడియాల, మోహన్‍-లత దేవినేని సహకారమందించారు. 

Updated Date - 2020-05-24T18:46:13+05:30 IST