పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి : తలసాని

ABN , First Publish Date - 2020-10-03T09:23:40+05:30 IST

ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్‌ ఓటరుగా తమ పేరును నమోదు చేయించుకోవాలని మం త్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి  : తలసాని

రాంగోపాల్‌పేట్‌, అక్టోబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్‌ ఓటరుగా తమ పేరును నమోదు చేయించుకోవాలని మం త్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు నమోదు చేసుకోవడం ప్రాథమిక బాధ్యత అని అన్నారు. త్వరలో జరగనున్న హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గ ఎన్నికలో ఓటు వేసేందుకు 2017కు ముందు డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా అర్హులన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ అతెల్లి అరుణ శ్రీనివాస్‌ గౌడ్‌, సికింద్రాబాద్‌ తహసీల్దార్‌ బాలశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి : తలసాని సాయికి రణ్‌ 

బేగంపేట : ప్రతి గ్రాడ్యుయేట్‌ తమ పేరును ఓటరుగా నమోదు చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని టీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తలసాని సాయికిరణ్‌యాదవ్‌ అన్నా రు. శుక్రవారం బేగంపేట డివిజన్‌ గ్రాడ్యుయే ట్స్‌ ఓటరు నమోదు కార్యక్రమం మారేడుపల్లిలోని తన నివాసంలో నిర్వహించారు. నవంబ రు 6తేదీ వరకు ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో బేగంపేట కార్పొరేటర్‌ ఉప్పల తరుణి నాయీ, నరేందర్‌నాయీ, కాంచనమాల, శ్రీనివా్‌సగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 


 ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి


 అమీర్‌పేట : త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఓటరు నమోదు ప్రక్రియకు శ్రీకా రం చుట్టాలని తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఓటరు నమో దు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అమీర్‌పేటకు వచ్చిన సాయికిరణ్‌యాదవ్‌ కార్పొరేటర్‌ శేషుకుమారితో కలిసి వివేకానంద కమ్యూనిటీ హాల్‌లో పట్టభద్రులకు ఓటరు నమోదు పత్రాలను అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షులు రాకేష్‌ జాదవ్‌, నరేందర్‌ రెడ్డి, విజయదుర్గ, లలితచౌహాన్‌ పాల్గొన్నారు. 


ఓటు హక్కును వినియోగించుకోవాలి 

బంజారాహిల్స్‌: ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే సరైనా నాయకత్వం అధికారంలోకి వస్తుందని జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌ కాజా సూర్యనారాయణ అన్నారు. త్వరలో జరగనున్నట్టు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నిమిత్తం ఓటరు నమోదుపై ఆయన శుక్రవారం ఫిలింనగర్‌లో పర్యటించి అవగాహన కల్పించారు. పట్టభద్రులతో ఓటరు నమోదు పత్రాలను నింపించారు. 


ఓటరుగా నమోదు చేసుకోవాలి

ఖైరతాబాద్‌ : గతంలో ఓటరుగా ఉ న్నా.. ఈ సారి తిరిగి కొత్తగా నమోదు చేసుకోవాల్సిందేనని, ఈ విషయమై పట్టభద్రులందరికీ అవగాహన కల్పించాలని కార్పొరేటర్‌ విజయారెడ్డి కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం ఆమె డివిజన్‌లోని మారుతీనగర్‌, బుడగ జం గం బస్తీల్లో ఇంటింటికెళ్లి ఓటర్ల నమోదు ప్రక్రి యను చేపట్టారు. ఇందులో వార్డు కమిటీ సభ్యులు నీతమ్మ, మున్ని, పార్వతి, నాయకులు రవీందర్‌ యాదవ్‌, సత్యనారాయణ, శ్రీనివాస్‌ యాదవ్‌, కరాటే రమేష్‌, మహే్‌షయాదవ్‌, కిషోర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-10-03T09:23:40+05:30 IST