దాతలూ..ఆదుకోండి
ABN , First Publish Date - 2020-09-14T09:32:11+05:30 IST
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. అయినా ఉన్నంతలో సాఫిగా సాగుతున్న వారి కుటంబం. వారికి ఇద్దరు పిల్లలు కుమార్తె డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఉన్నట్టుండి వారి కుమార్తె
కుషాయిగూడలో కిడ్నీ వ్యాధితో డిగ్రీ విద్యార్థిని అవస్థ
వైద్యం కోసం లక్షలు ఖర్చు దాతల సాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు
ఏఎ్‌సరావునగర్, సెప్టెంబర్ 13(ఆంధ్రజ్యోతి): రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. అయినా ఉన్నంతలో సాఫిగా సాగుతున్న వారి కుటంబం. వారికి ఇద్దరు పిల్లలు కుమార్తె డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఉన్నట్టుండి వారి కుమార్తె మూడు నెలల క్రితం అనారోగ్యానికి గురైంది. వెంటనే పలు ఆస్పత్రుల్లో చూపించగా వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాధితురాలికి రెండు కిడ్నీలు చెడిపోయాయని చెప్పారు. అప్పటి నుంచి వైద్యం కోసం లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి ఖర్చు పెట్టారు. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వలేదని, తమ కుమార్తె వైద్యం కోసం దాతలు సహకరించి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు కుషాయిగూడ లక్ష్మీనర్సింహకాలనీలో నివా సం ఉండే మెరుగు శంకర్, సుజాత దంపతులు. కుమార్తె మెరుగు భువనేశ్వరి(18) సికింద్రాబాద్‌లోని రైల్వే డిగ్రీ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. మూడు నెలల క్రితం ఆయాసంతో సరిగా ఊపిరాడక బాధపడుతున్న భువనేశ్వరిని స్థానికంగా పలు ఆస్పత్రుల్లో చూపించగా కరోనా కావచ్చని వైద్యానికి నిరాకరించారు.
కొవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. అయినా ఆయాసం తగ్గకపోవడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు భువనేశ్వరికి రెండు కిడ్నీలు చెడిపోయానని చెప్పారు. దీంతో డయాలసిస్ చేయడం ప్రారంభించారు. ఇందుకు ఇప్పటి వరకు సుమారు రూ.7లక్షల వరకు ఖర్చు చేశామని, ఇక తమకు వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేదని... దాతలు ఎవరైనా ఆర్థికంగా ఆదుకొని మా బిడ్డ ప్రాణాలను కాపాడాలని తల్లిదండ్రులు శంకర్, సుజాత కోరుతున్నారు. తమ కుమార్తె అనారోగ్యం పాలవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంత మవుతున్నారు. ఆర్థికంగా ఆదుకునే దాతలు ఆంధ్రా బ్యాంకు అకౌంట్ నెం-141910100119350- ఐఎ్‌ఫఎస్‌సీ కోడ్ - ఏఎన్‌డీ-బీ0001419 లేదా 9246841627 నెంబర్‌లో సంప్రదించాలని వారు కోరుతున్నారు.