తండ్రి మందలించడంతో పారిపోయిన విద్యార్థి

ABN , First Publish Date - 2020-12-15T05:59:45+05:30 IST

చదువుకోవాలని తండ్రి మందలించడంతో 7వ తరగతి విద్యార్థి ఇంటి నుంచి పారిపోయాడు.

తండ్రి మందలించడంతో పారిపోయిన విద్యార్థి

బర్కత్‌పుర: చదువుకోవాలని తండ్రి మందలించడంతో 7వ తరగతి  విద్యార్థి ఇంటి నుంచి పారిపోయాడు. కాచిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మౌలనాఆజాద్‌నగర్‌లో నివాసం ఉంటున్న షంషుద్దీన్‌ కుమారుడు అర్బజ్‌(14) 7వ తరగతి చదువుతున్నాడు. బాగా చదవాలని తండ్రి మందలించడంతో ఈ నెల 8న ఇంటి నుంచి వెళ్లిపోయిన అర్బజ్‌ తిరిగి రాలేదు. తండ్రి షంషుద్దీన్‌ సోమవారం కాచిగూడ పీఎ్‌సలో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-15T05:59:45+05:30 IST