కట్టడి ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు

ABN , First Publish Date - 2020-05-13T07:38:51+05:30 IST

రామంతాపూర్‌లోని కట్టడి ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.

కట్టడి ప్రాంతాల్లో  కట్టుదిట్టమైన చర్యలు

రామంతాపూర్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): రామంతాపూర్‌లోని కట్టడి ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. నవరంగ్‌గూడలో ఇరువురు చిన్నారులకు కరోనా పాజిటివ్‌ రావడం, శ్రీరమణపురం, పాశం సత్తయ్య కాలనీల్లో వైరస్‌ సోకిన వ్యక్తుల హోం క్వారంటైన్‌ నేపథ్యంలో కట్టడి చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లి రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. 

Read more