దర్పల్లి నరసింహ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ABN , First Publish Date - 2020-10-08T00:33:21+05:30 IST

ఎల్బీనగర్ పురపాలక సంఘం మాజీ చైర్మన్ దర్పల్లి నరసింహ విగ్రహాన్ని సరూర్‌నగర్ బస్ స్టాప్ వద్ద రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు.

దర్పల్లి నరసింహ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్: ఎల్బీనగర్ పురపాలక సంఘం మాజీ చైర్మన్ దర్పల్లి నరసింహ విగ్రహాన్ని సరూర్‌నగర్ బస్ స్టాప్ వద్ద రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు, సరూర్ నగర్ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి, కుటుంబసభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను పలువురు కొనియాడారు. ఎల్బీ నగర్ అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించారని అన్నారు. 





Read more