యువతకు ఆధ్యాత్మికత.. ఆర్కే మఠ్ ఆన్ లైన్ కోర్స్

ABN , First Publish Date - 2020-11-27T22:16:55+05:30 IST

నగరంలోని ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ 21వ వార్షికోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు ఆన్ లైన్ కోర్సులను అందిస్తోంది.

యువతకు ఆధ్యాత్మికత.. ఆర్కే మఠ్ ఆన్ లైన్ కోర్స్

దోమలగూడ: నగరంలోని ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ 21వ వార్షికోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు ఆన్ లైన్ కోర్సులను అందిస్తోంది. ‘యువతకు ఆధ్యాత్మికత’ అనే అంశంపై కొత్త ఆన్ లైన్ కోర్సును అందివ్వనున్నట్టు తెలిపింది. నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే క్లాసులు డిసెంబర్  4 వరకు ఐదు రోజుల పాటు జరగనున్నాయి. సాయంత్రం 6.15 గంటల నుంచి 7.15 గంటల వరకు క్లాసులు జరగనున్నాయి. తమ వెబ్ సైట్‌లో సంబంధిత కోర్సు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వీఐహెచ్ఈ తెలిపింది. 16 - 40 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. 


ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు.   


మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.   

Read more