వివిధ మార్గాల్లో 16 ప్రత్యేక రైళ్లు
ABN , First Publish Date - 2020-02-08T17:22:09+05:30 IST
వివిధ మార్గాల్లో 16 ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్(ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ మార్గాల్లో 16 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు.
- నర్సాపూర్-హైదరాబాద్ స్పెషల్ (రైల్ నెంబర్:07258) నర్సాపూర్ నుంచి ఈ నెల 9, 16, 23, మార్చి 1, 8, 15, 22, 29వ తేదీల్లో సాయంత్రం 6 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు హైదరాబాద్ చేరుతుంది.
- హైదరాబాద్-విజయవాడ స్పెషల్ (రైల్ నెంబర్: 07257) హైదరాబాద్ నుంచి ఈ నెల 10, 17, 24, మార్చి 2, 9, 16, 23, 30వ తేదీల్లో రాత్రి 11.15 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విజయవాడ చేరుతుంది.
- అజ్మీర్‌లో ఉర్సు ఉత్సవాల కోసం 10 ప్రత్యేక రైళ్లు...
- హైదరాబాద్-అజ్మీర్ స్పెషల్ (రైల్ నెంబర్: 07125) ఈ నెల 27(గురువారం)న రాత్రి 7.50 గంటలకు బయల్దేరి శనివారం ఉదయం 4 గంటలకు అజ్మీర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో అజ్మీర్-హైదరాబాద్ స్పెషల్ (రైల్ నెంబర్: 07126) అజ్మీర్ నుంచి మార్చి 3(మంగళవారం)న రాత్రి 11.35 గంటలకు బయల్దేరి హైదరాబాద్‌కు గురువారం ఉదయం 10 గంటలకు చేరుతుంది.
- కాచిగూడ-అజ్మీర్ స్పెషల్ (రైల్ నెంబర్:07129) కాచిగూడ నుంచి ఈ నెల 27(గురువారం)న రాత్రి 11 గంటలకు బయల్దేరి, శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అజ్మీర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో అజ్మీర్-కాచిగూడ స్పెషల్ (రైల్ నెంబర్:07130) మార్చి 4(బుధవారం)న రాత్రి 7.25 గంటలకు బయల్దేరి శుక్రవారం తెల్లవారుజాము 3.25 గంటలకు కాచిగూడ చేరుతుంది.
- మచిలీపట్నం-విజయవాడ స్పెషల్ (రైల్ నెంబర్:07131) మచిలీపట్నం నుంచి ఈ నెల 27న మధ్యాహ్నం 1.40 గంటలకు బయల్దేరి, అదే రోజు మధ్యాహ్నం 2.35 గంటలకు విజయవాడ చేరుతుంది.
- నెల్లూరు-అజ్మీర్ స్పెషల్ (రైల్ నెంబర్: 07227) నెల్లూరు నుంచి ఈ నెల 27(గురువారం)న ఉదయం 11 గంటలకు బయల్దేరి శుక్రవారం రాత్రి 11.30 గంటలకు అజ్మీర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో అజ్మీర్-నెల్లూరు స్పెషల్ (రైల్ నెంబర్:07228) అజ్మీర్ నుంచి మార్చి 5న రాత్రి 11.45 గంటలకు బయల్దేరి శనివారం సాయంత్రం 6 గంటలకు నెల్లూరు చేరుతుంది.
- హెచ్.ఎస్.నాందేడ్-మదర్ జంక్షన్ స్పెషల్ (రైల్ నెంబర్: 07641) హెచ్.ఎ్‌స.నాందేడ్ నుంచి ఈ నెల 28(శుక్రవారం)న సాయంత్రం 4 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 11.35 గంటలకు మదర్ స్టేషన్‌కు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మదర్-హెచ్.ఎ్‌స.నాందేడ్ స్పెషల్ (రైల్ నెంబర్: 07642) మదర్ స్టేషన్ నుంచి మార్చి 4(బుధవారం)న రాత్రి 9.25 గంటలకు బయల్దేరి, శుక్రవారం ఉదయం 7 గంటలకు హెచ్.ఎ్‌స.నాందేడ్‌కు చేరుతుంది.