హైదరాబాద్‌లో కరోనాపై సర్వేలో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి..
ABN , First Publish Date - 2020-03-16T16:21:27+05:30 IST
కరోనా అందరినీ కలవర పెడుతోంది. దీంతో వైరస్‌పై పౌరులు అవగాహన పెంచుకుంటున్నారు. ఎవరికి వారే అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. పరిశుభ్రతను పాటిస్తున్నారు. శానిటైజర్ల వినియోగం పెరిగింది. ముఖానికి మాస్క్‌లు లేకుండా బయటికి వెళ్లడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళిక మేరకు అన్ని
ప్రభుత్వ నిర్ణయం మంచిదే..
అవగాహనతో ముందడుగు
ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న పౌరులు
కరోనాపై సర్వేలో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి
హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): కరోనా అందరినీ కలవర పెడుతోంది. దీంతో వైరస్‌పై పౌరులు అవగాహన పెంచుకుంటున్నారు. ఎవరికి వారే అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. పరిశుభ్రతను పాటిస్తున్నారు. శానిటైజర్ల వినియోగం పెరిగింది. ముఖానికి మాస్క్‌లు లేకుండా బయటికి వెళ్లడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళిక మేరకు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు ముందు జాగ్రత్తగా నిత్యావసర సరుకులు, అత్యవసర మందులు నిల్వ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ విషయంలో పౌరులు ఎలా అప్రమత్తం అయ్యారు... ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారనే అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ బృందం సర్వే నిర్వహించింది.
బయటి ఫుడ్ బంద్..
కరోనా వైరస్ నేపథ్యంలో శుచికి, శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లడాన్ని తగ్గించిన నగర పౌరులు, బయటి ఆహారాన్ని తగ్గించారు. గతంలో హోటళ్లు, రెస్టారెంట్లు ఇలా బయటి ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. వీకెండ్ వస్తే కచ్చితంగా బయటి ఫుడ్‌కే ఓటేసే వారు. ప్రస్తుతం ఈ ధోరణిలో మార్పు వచ్చింది. సర్వేలో మొత్తం వెయ్యి మంది పాల్గొనగా, 620 మంది బయటి ఆహారాన్ని తగ్గించామని చెప్పారు. 380 మంది అలాంటిదేమీ లేదన్నారు.
చికెన్.. కెన్..కెన్..
చికెన్ తింటే కరోనా వస్తుందని తప్పుడు ప్రచారం జరిగింది. దీంతో చాలా మంది చికెన్ తినడం మానివేశారు. అయితే, చికెన్‌కు.. కరోనాకు సంబంధం లేదని తెలుసా అని ప్రశ్నించగా, తెలుసు అని 810 మంది చెప్పారు. తెలియదు అని 190 మంది అన్నారు. మరి ఎందుకు చికెన్ తినడం లేదని ప్రశ్నిస్తే 200 మంది ముందు జాగ్రత్త కోసమని చెప్పగా, 680 మంది ఇంట్లో వారు వద్దంటున్నారని.. అందుకే తినడం లేదని చెప్పారు. మరో 120 మంది ఎందుకైనా మంచిదని.. ఇంట్లో వారి ఒత్తిడి వల్ల తినడం లేదని చెప్పారు. ప్రస్తుతం నాన్ వెజ్ మానేశారా అంటే 900 మంది అవునని, వంద మంది మానేయలేదని సమాధానమిచ్చారు.
మూసివేత మంచిదే..
వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు తదితరాలను మూసివేయడం మంచిదేనని చాలా మంది అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని 890 మంది పేర్కొనగా, కాదని 50 మంది, ఏం చెప్పలేమని 60 మంది సమాధానమిచ్చారు.
ముందే కొనుగోళ్లు..
వైరస్ నేపథ్యంలో కొందరు ఎందుకైనా మంచిదని నిత్యావసర వస్తువులను ముందే కొనుగోలు చేస్తున్నారు. ఈ అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా, ముందుగానే కొనుగోలు చేస్తున్నామని 450 మంది చెప్పారు. లేదని 550 మంది అన్నారు. నెలకు సరిపడా సరుకులు తీసుకున్నట్లు 530 మంది, రెండు వారాలకు సరిపడా తీసుకున్నామని 320 మంది, వారం రోజుల సరుకులు తీసుకున్నామని 150 మంది చెప్పారు. సరుకులను దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నామని 750 మంది, ఆన్‌లైన్ ద్వారా అని 250 మంది వివరించారు.
వర్క్ ఫ్రం.. హోం
నగరంలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారే ఎక్కువగా ఉన్నారు. మీరు ప్రైవేట్ ఉద్యోగులా అని ప్రశ్నించగా 750 మంది అవునని, 250 మంది కాదని జవాబు ఇచ్చారు. వైసర్ నేపథ్యంలో కంపెనీ వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చిందా అని ప్రశ్నిస్తే అవునని 530 మంది పేర్కొన్నారు. లేదని 470 మంది వివరించారు. వర్క్ ఫ్రం హోంకు రిక్వెస్ట్ చేశారా అని ప్రశ్నిస్తే 780 మంది అవుననే అన్నారు. చేయలేదని 220 మంది చెప్పారు.
రద్దీ.. రంది వద్దు..
కరోనా నేపథ్యంలో బయటకు వెళ్తున్నారా అని ప్రశ్నిస్తే.. వెళ్తున్నామని 420 మంది, వెళ్లడం లేదని 580 మంది తేల్చిచెప్పారు. బయటకు వెళ్లినా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉంటున్నామని చెప్పారు. మాస్కులు పెట్టుకుని వెళ్తున్నామని, తుమ్ములు.. దగ్గులు వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉంటున్నామన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగిస్తున్నారా అని ప్రశ్నిస్తే 450 మంది అవునని, సొంత వాహనాల్లో వెళ్తున్నామని మిగిలిన 550 మంది చెప్పారు.
బయట తినడం తగ్గించారా..?
తగ్గించలేదు: 38శాతం మంది
తగ్గించాం: 62శాతం మంది
కరోనాకు చికెన్‌కు సంబంధం లేదన్న విషయం తెలుసా..?
తెలియదు: 19శాతం మంది
తెలుసు: 81శాతం మంది
కరోనా భయంతో నాన్‌వెజ్ తినడం మానేశారా..?
అవును: 90శాతం మంది
లేదు: 10శాతం మంది
చికెన్ ఎందుకు తినడం లేదు?
ముందు జాగ్రత్త కోసం: 20శాతం మంది
ఇంట్లో వాళ్లు వద్దంటున్నారు: 68శాతం మంది
పై రెండు కారణాలు: 12శాతం మంది
బయటకు వెళ్లడం తగ్గించారా..?
అవును: 42శాతం మంది
లేదు: 58శాతం మంది
నిత్యావసర వస్తువులు ముందే కొనుగోలు చేశారా..?
అవును: 35శాతం మంది
కాదు: 65శాతం మంది
స్కూళ్లు, థియేటర్లు మూసివేయాలన్న ఆదేశాలపై మీ రియాక్షన్
సరైన నిర్ణయం కాదు: 5శాతం మంది
చెప్పలేం: 6శాతం మంది
సరైన నిర్ణయమే: 89శాతం మంది
నిత్యావసర వస్తువులు ఎలా కొనుగోలు చేస్తున్నారు..?
ఆన్‌లైన్‌లో.. : 25శాతం మంది
దుకాణాలకు వెళ్లి.. : 75శాతం మంది
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగిస్తున్నారా..?
అవును: 45శాతం మంది
సొంత వాహనాల్లో వెళ్తున్నాం: 55శాతం మంది
వర్క్ ఫ్రం హోం కోసం రిక్వెస్ట్ చేశారా..?
చేశాం..: 78శాతం మంది
చేయలేదు: 22శాతం మంది
కంపెనీ వర్క్‌ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చిందా..?
ఇచ్చింది: 53శాతం మంది
ఇవ్వలేదు: 47శాతం మంది
మీరు ప్రైవేటు ఉద్యోగులా..?
అవును: 75శాతం మంది
కాదు: 25శాతం మంది
ఎన్ని రోజులకు సరిపడా సరుకులు సిద్ధం చేసుకున్నారు..?
వారం రోజులకు: 15శాతం మంది
రెండు వారాలకు: 32శాతం మంది..
ముందస్తు ఏర్పాట్లేమీ చేసుకోలేదు: 53శాతం మంది
సెలవులు కరెక్టే..
కరోనా వైరస్ విజృభించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో స్కూల్స్, కళాశాలలు కొద్ది రోజుల వరకు మూసి వేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మంచిదే. అదే విధంగా అత్యధికంగా రద్దీ ప్రాంతాలలో కూడా కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర దేశాల నుంచి నగరానికి వచ్చే వారిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మాంసాహారం వల్ల కరోనా వస్తుందా, రాదా అన్న దానిపై ప్రజల్లో అవగాహన కల్పించాలి.
మరింత అవగాహన కల్పించాలి
కరోనాపై ప్రజలో అవగాహన కల్పించాలి. చాలామంది ఈజీగా తీసుకుంటున్నారు. అలాంటి వారిలో అవగాహన పెంచి, అప్రమత్తం చేయాలి. పరిసరాలు మరింత శుభ్రంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేయాలి.
-మోటూరు వ్యాస్ గుప్త, హయత్‌నగర్
మంచి నిర్ణయం
కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలలో భాగంగా విద్యాసంస్థలకు సెలవులు, థియేటర్లు, పార్కులు పబ్ వంటివి మూసివేయడం మంచిదే. జనసమూహ కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టాలి. కరోనా భయంతో అత్యవసర పనులుంటేనే బయటకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది.
-కె.కాశన్న, సింగరేణి కాలనీ, సైదాబాద్