మెరిట్‌ ప్రకారం పోస్టులు భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2020-12-15T06:35:39+05:30 IST

టీఎ్‌సఎస్పీడీసీఎల్‌లో 1:2 నిష్పత్తిలో ఖాళీగా ఉన్న 753 పోస్టులను మెరిట్‌ ప్రకారం రెండో లిస్ట్‌లో భర్తీచేయాలని జేఎల్‌ఎం అభ్యర్థులు డిమాండ్‌ చేశారు.

మెరిట్‌ ప్రకారం పోస్టులు భర్తీ చేయాలి
ఎస్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న జేఎల్‌ఎం అభ్యర్థులు

జేఎల్‌ఎం అభ్యర్థులు 

హైదరాబాద్‌సిటీ, డిసెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): టీఎ్‌సఎస్పీడీసీఎల్‌లో 1:2 నిష్పత్తిలో ఖాళీగా ఉన్న 753 పోస్టులను మెరిట్‌ ప్రకారం రెండో లిస్ట్‌లో భర్తీచేయాలని జేఎల్‌ఎం అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. సోమవారం మింట్‌కాంపౌండ్‌లోగల ఎస్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం వద్ద న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. జేఎల్‌ఎం పరీక్షలో ఉత్తీర్ణులైన తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా కార్యాలయాల చుటూ తిప్పించుకుంటున్నారని మధు, శ్రీనివాస్‌ ఆరోపించారు. విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డిని కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు పోల్‌ టెస్ట్‌లో పాసైన జేఎల్‌ఎం అభ్యర్థులకు ఉద్యోగాలివ్వకపోవడంతో 15 రోజులుగా మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నామని తెలిపారు. విద్యుత్‌శాఖలో రిటైర్డ్‌ అయిన ఉద్యోగులను ఆపరేటర్లుగా నియమిస్తూ నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు వచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు.

Updated Date - 2020-12-15T06:35:39+05:30 IST