యువత సంకల్ప బలంతో రాణించాలి
ABN , First Publish Date - 2020-12-30T06:23:23+05:30 IST
యువత ఏ రంగంలోనైనా రాణించాలంటే తపన, బలమైన సంకల్పం ఉన్నప్పుడే వారు ఎంచుకున్న లక్ష్యం సాధ్యమవుతుందని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు.

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య
రాంనగర్, డిసెంబర్
29 (ఆంధ్రజ్యోతి): యువత ఏ రంగంలోనైనా రాణించాలంటే తపన, బలమైన సంకల్పం
ఉన్నప్పుడే వారు ఎంచుకున్న లక్ష్యం సాధ్యమవుతుందని రాష్ట్ర మానవహక్కుల
కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. మంగళవారం
బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ముద్ర అగ్రికల్చర్ అండ్
స్కిల్ డెవల్‌పమెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో
‘కొత్త సంవత్సరం-కొత్త జీవితం’ అంశంపై సదస్సు జరిగింది. జస్టిస్ చంద్రయ్య
మాట్లాడుతూ.. యువత, యువ ఉద్యోగులు ప్రధాన అంశాన్ని ఎంచుకుని వాటిని
పరిష్కరించేందుకు అహర్నిశలు పాటుపడాలని సూచించారు. హైకోర్టు మాజీ
న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. అవినీతి రహిత సమాజం
కావాలన్నారు. కరోనా వల్ల లక్షలాది మంది యువత నిరుద్యోగంతో అనేక సమస్యలు
ఎదుర్కొంటున్నారని అన్నారు. వారికి ప్రభుత్వ, ప్రైవేట్ పరంగా ఉపాధి,
ఉద్యోగాలను కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు
చేపట్టాలన్నారు. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఉద్యోగులకు
చక్కని స్ఫూర్తినిచ్చే సందేశం ఇచ్చారు. సంస్థ చైర్మన్ రామదాసప్పనాయుడు
కూడా సదస్సులో మాట్లాడారు. ఈ సందర్భంగా ముద్ర ప్రత్యేక ప్యాకేజీల
వాల్‌పోస్టర్‌ను జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ చంద్రకుమార్ ఆవిష్కరించారు.