గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటిన అక్కాచెల్లెళ్లు
ABN , First Publish Date - 2020-12-06T14:08:37+05:30 IST
అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన అక్కాచెల్లెళ్లు..

హైదరాబాద్/చంపాపేట : అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన అక్కాచెల్లెళ్లు గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటారు. భారతీనగర్ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి సింధూరెడ్డి, ఐఎస్‌సదన్ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థి జంగం శ్వేతామధుకర్‌రెడ్డి పోటీ చేసి కార్పొరేటర్లుగా విజయం సాధించారు. వీరిద్దరు సైదాబాద్‌కు చెందిన సొంత సోదరులు బద్దం మధుసూదన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి కుమార్తెలు. ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు విజయం సాధించడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.