నిమ్స్‌లో సిబ్బందికి మాస్కులు కరువు...
ABN , First Publish Date - 2020-03-25T09:44:14+05:30 IST
నిమ్స్ ఆస్పత్రిలోని వివిధ వి భాగాల్లో సేవలందిస్తున్న సిబ్బందికి వైరస్ స్వీయ నియంత్రణ పరికరాలు కరువయ్యాయి. కొన్ని రోజులుగా సిబ్బంది...

వెంకటేశ్వరకాలనీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): నిమ్స్ ఆస్పత్రిలోని వివిధ వి భాగాల్లో సేవలందిస్తున్న సిబ్బందికి వైరస్ స్వీయ నియంత్రణ పరికరాలు కరువయ్యాయి. కొన్ని రోజులుగా సిబ్బంది మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని యాజమాన్యాన్ని కోరినా ఫలితం లేకుండా పోయిందని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. కరోనా నేపథ్యంలో రోగులకు సేవలు చేసేందుకు నర్సింగ్ సిబ్బంది భయపడుతున్నారు. ఇప్పటికైనా నిమ్స్‌లోని వివిధ స్థాయిల్లో సేవలందిస్తున్న సిబ్బందికి మాస్కులు, గ్లౌవుజులు, శానిటైజర్‌లు అందజేసి ఇబ్బందులు తొలగించాలని పలువురు కోరుతున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ అన్ని విభాగాల్లో పని చేసే వారికి మాస్క్‌లు, చేతి తొడుగులు అవసరం ఉండదని చెప్పారు. అవసరమైన వారికి అందజేస్తున్నామని చెప్పారు.