నమస్తే పెట్టనందుకు హత్య..!
ABN , First Publish Date - 2020-09-06T09:33:59+05:30 IST
నమస్తే పెట్టలేదని ఒకరిని దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు.
కత్తితో పొడిచి..
హసన్‌నగర్, సెప్టెంబర్ 5 (ఆంధ్రజ్యోతి): నమస్తే పెట్టలేదని ఒకరిని దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రోషన్ కాలనీకి చెందిన షేక్ జావీద్(28) వంట మనిషిగా పనులు చేస్తుంటాడు. శుక్రవారం రాత్రి 12:30 గంటల సమయంలో అన్సారీ రోడ్డు ఓవైసీ హిల్స్ వద్ద నిలబడి ఉండగా, అటుగా నలుగురు వ్యక్తులు వెళ్తున్నారు. వారిలో ఒకరిని షేక్ జావీద్ గుర్తు పట్టి నమస్తే పెట్టాడు.
ఆ నలుగురిలో ఒకరు నాకు నమస్తే ఎందుకు పెట్టడం లేదంటూ గొడవకు దిగాడు. తన వద్ద ఉన్న కత్తితో జావీద్‌ను విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో జావీద్ అక్కడికక్కడే చనిపోయాడు. జావీద్‌కు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ కె.నర్సింహ, ఎస్‌ఐ నదీముద్దీన్‌లు తెలిపారు.
పోలీసుల అదుపులో నిందితులు?
షేక్ జావీద్‌ను హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ, తాము ఇంకా ఎవరినీ పట్టుకోలేదని పోలీసులు అంటున్నారు. పోలీసుల అదుపులో అజహార్, హన్నాన్, సయిద్, కమ్రాన్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.