పోకిరీపై గురి.. బస్టా్‌పలు, మాల్స్‌లో.. షీటీమ్స్‌ నిఘా

ABN , First Publish Date - 2020-12-10T07:00:41+05:30 IST

ప్రైవేట్‌ ఉద్యోగం చేసే యువతి.. బాచుపల్లి బస్టాప్‌లో రోజూ బస్సుకోసం వేచి ఉండేది.

పోకిరీపై గురి.. బస్టా్‌పలు, మాల్స్‌లో.. షీటీమ్స్‌ నిఘా
బస్టా్‌పలో మఫ్టీలో ఉన్న సైబరాబాద్‌ షీటీమ్స్‌ (యారో మార్క్‌ ఉన్నవారు)

డెకాయ్‌ ఆపరేషన్స్‌తో భరతం పడుతున్న పోలీసులు

30 రోజుల్లో 277 డెకాయ్‌లు 

147 కేసుల నమోదు

ప్రైవేట్‌ ఉద్యోగం చేసే యువతి.. బాచుపల్లి బస్టాప్‌లో రోజూ బస్సుకోసం వేచి ఉండేది. ఆమెపై కన్నేసిన ఓ పోకిరీ అక్కడకు వచ్చి ఏదో వంకతో మాట్లాడేవాడు. ఆమెకు దగ్గరగా నిలబడి తాకడానికి ప్రయత్నించేవాడు. అతని చేష్టలకు విసిగిపోయి యువతి షీటీమ్స్‌కు మెసేజ్‌ చేసింది. సైబరాబాద్‌ షీటీమ్స్‌ రంగంలోకి దిగారు. మరుసటి రోజు ఆ యువతి నిలబడి ఉన్న బస్టా్‌పలో మహిళా పోలీస్‌ మఫ్టీలో వెళ్లి కూర్చుంది. ఆ రోజు కూడా అతను అక్కడకు వచ్చి రోజూలాగే యువతిని వేధించడం ప్రారంభించాడు. అక్కడే మఫ్టీలో ఉన్న మహిళా పోలీస్‌ అదంతా వీడియో తీసి, పోకిరీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. వెంటనే అక్కడికి వచ్చిన షీటీమ్స్‌ బృందం అతడిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించింది. పెట్టీ కేసు నమోదు చేసి అతని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చింది.


కేపీహెచ్‌బీకి చెందిన ఓ మహిళ తన కారులో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. అక్కడ తన కారు పార్కింగ్‌ చేస్తున్న క్రమంలో అక్కడే ఉన్న ఇద్దరు క్యాబ్‌ డ్రైవర్‌లు ఆమెను అసభ్య పదజాలంతో కామెంట్‌ చేశారు. నిలదీసిన ఆ మహిళతో దురుసుగా ప్రవర్తించారు. ఎయిర్‌పోర్టులో సైబరాబాద్‌ పోలీసులు ఇటీవల ఏర్పాటు చేసిన మహిళా హెల్ప్‌డె్‌స్కలో  ఆమె ఫిర్యాదు చేసింది. వారి ద్వారా సమాచారం అందుకున్న షీటీమ్స్‌ బృందం రంగంలోకి దిగి, క్యాబ్‌డ్రైవర్లను అదుపులోకి తీసుకుంది.

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 9(ఆంధ్రజ్యోతి): మహిళల భద్రతకు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పెద్దపీట వేస్తున్నారు. కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 11 షీటీమ్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు. బస్టాపులు, రైల్వేస్టేషన్‌లు, మాల్స్‌, సినిమా థియేటర్స్‌తో పాటు.. జనసమ్మర్థం ఉన్న పలు ప్రాంతాల్లో యువతులను, మహిళలను వేధిస్తున్న పోకిరీలు, ఆకతాయిల ఆటకట్టించడానికి మఫ్టీలో షీటీమ్‌ పోలీసులను రంగంలోకి దింపారు. ఒక్కో టీమ్‌కు ఒక ప్రత్యేక ఫోన్‌ నంబర్‌ను కేటాయించడంతో పాటు. కమిషనరేట్‌ పరిధిలో ప్రత్యేక వాట్సప్‌ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చి మహిళల భద్రతకు భరోసా కల్పిస్తున్నారు.


మహిళల భద్రత.. మా బాధ్యత..

పోకిరీల ఆటకట్టించడానికి ప్రత్యేక పోలీస్‌ బృందాలున్నాయి. మహిళల భద్రతే.. బాధ్యతగా షీటీమ్స్‌ పనిచేస్తున్నాయి. నవంబర్‌లో 277 డెకాయ్‌ ఆపరేషన్‌లు నిర్వహించాం. పోకిరీలపై 147 కేసులు నమోదు చేశాం. 237 సదస్సుల ద్వారా మహిళలకు అవగాహన  కల్పించాం. బాధిత మహిళలు వేధింపులు భరించొద్దు. ధైర్యంగా షీటీమ్స్‌కు తెలియజేయండి. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతాం.

అనసూయ, డీసీపీ, షీటీమ్స్‌ ఇన్‌చార్జి, సైబరాబాద్‌..

సంప్రదించాల్సిన షీటీమ్స్‌ నంబర్‌లు 


సైబరాబాద్‌ వాట్సప్‌ నంబర్‌ 9490617444, 

బాలానగర్‌ 9490617349

ఐటీ కారిడార్‌ 9490617352

మాదాపూర్‌ 8333993519

కూకట్‌పల్లి 9493626811

జగద్గిరిగుట్ట 9493624561

మియాపూర్‌ 9491051421

పేట్‌బషీరాబాద్‌ 7901114137

రాజేంద్రనగర్‌ 7901114140

శంషాబాద్‌ 9490617354

చేవెళ్ల 9493625379

షాద్‌నగర్‌ 9493624147

ఫ డయల్‌-100, హాక్‌ఐ 

అప్లికేషన్‌, సైబరాబాద్‌ ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాంలలో కూడా ఫిర్యాదు చేయవచ్చు.

Updated Date - 2020-12-10T07:00:41+05:30 IST