సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల ఆందోళన

ABN , First Publish Date - 2020-12-01T12:43:18+05:30 IST

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల ఆందోళన

హైదరాబాద్: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఢిల్లీకి వెళ్లే  శాలిమార్‌ ఎక్స్‌ప్రెస్ రెండు గంటల ముందే రైల్వేస్టేషన్‌ను బయల్దేరింది. ఉదయం 5:40 గంటలకు  వెళ్లాల్సిన శాలిమార్‌ ఎక్స్‌ప్రెస్ రైలు.. తెల్లవారుజామున 3:45గంటలకే బయలుదేరడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ కూడా గంట ముందే బయల్దేరి వెళ్లింది. దీంతో రైళ్లు వెళ్లే సమయంపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రైల్వే అధికారులు ఇబ్బంది పెట్టారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2020-12-01T12:43:18+05:30 IST