పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ బడ్జెట్‌లో కేంద్ర వాటాను కొనసాగించాలి

ABN , First Publish Date - 2020-12-17T07:28:45+05:30 IST

దళిత, ఆదివాసీ విద్యార్థులకు జీవన క్షేత్రంగా ఉన్న పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ వాటాను యధావిధిగా కొనసాగించాలని దళిత బహుజన శ్రామిక యూనియన్‌

పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ బడ్జెట్‌లో కేంద్ర వాటాను కొనసాగించాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీబీఎ్‌సయూ రాష్ట్ర అధ్యక్షుడు బి.నర్సింహ, పాల్గొన్న శివలింగం తదితరులు

- దళిత బహుజన శ్రామిక యూనియన్‌ డిమాండ్‌
రాంనగర్‌, డిసెంబర్‌ 16 (ఆంధ్రజ్యోతి):
దళిత, ఆదివాసీ విద్యార్థులకు జీవన క్షేత్రంగా ఉన్న పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ వాటాను యధావిధిగా కొనసాగించాలని దళిత బహుజన శ్రామిక యూనియన్‌ (డీబీఎ్‌సయు) అధ్యక్షుడు బి.నర్సింహా, దళిత బహుజన శ్రామిక యూనియన్‌ (డీబీఎ్‌సయూ) గుండు నర్సింహ డిమాండ్‌ చేశారు. బుధవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పథకం నుంచి 62 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం ఉందన్నారు. కానీ ఇప్పుడు వారందరికీ ముప్పు పొంచి ఉందన్నారు. ఈ పథకానికి స్వస్తి పలికే చర్యలకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 60:40 నిష్పత్తి భాగస్వామ్యంతో పాత పద్ధతిలోనే పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ కొనసాగించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో బీడీఎ్‌సయు నేతలు ఎస్‌.శివలింగం, శ్రీరామ్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-17T07:28:45+05:30 IST