మహిళను కాపాడిన పోలీసులు

ABN , First Publish Date - 2020-12-28T07:03:25+05:30 IST

భర్తతో గొడవ పడిన ఇల్లాలు కఠిన నిర్ణయం తీసుకుంది. తాను చనిపోతేనే కష్టాలు తీరతాయని భావించి ఇంటికి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకోబోయింది.

మహిళను కాపాడిన పోలీసులు

బంజారాహిల్స్‌, డిసెంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): భర్తతో గొడవ పడిన ఇల్లాలు కఠిన నిర్ణయం తీసుకుంది. తాను చనిపోతేనే కష్టాలు తీరతాయని భావించి ఇంటికి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకోబోయింది. గమనించిన స్థానికుడు పోలీసులకు సమాచారమివ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను కాపాడారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 5 దుర్గాభవానీనగర్‌కు చెందిన శ్రీను, ములావత్‌ సిరి దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు. శ్రీను ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ రెండురోజుల పాటు కొనసాగింది. జీవితంపై విరక్తి చెందిన సిరి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తమ ఇంటి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకునేందుకు యత్నించింది. గమనించిన స్థానికుడు విశ్వనాథ్‌ అనే వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. జూబ్లీహిల్స్‌ ఎస్‌ఐ శేఖర్‌ ఆ ప్రాంతానికి బ్లూకోల్ట్స్‌, పెట్రోలింగ్‌ సిబ్బందిని పంపించి ఆమెను కాపాడారు. 

Updated Date - 2020-12-28T07:03:25+05:30 IST