‘సరోజినీ’ కూడా కరోనాకే..!

ABN , First Publish Date - 2020-03-18T09:20:14+05:30 IST

కరోనా వైర్‌సను కట్టడి చేసేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇప్పటికే పలు ప్రధాన ఆస్పత్రుల్లో వైరస్‌ అనుమానితులను ఉంచేందుకు ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయగా, మెహిదీపట్నంలోని సరోజినీ దేవి ప్రభుత్వ కంటి ఆస్పత్రిలోనూ కరోనా వైరస్‌ అనుమాతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

‘సరోజినీ’ కూడా కరోనాకే..!

ముమ్మరంగా ఏర్పాట్లు

అనుమానితుల కోసం ప్రత్యేక దారి

పనులను పర్యవేక్షిస్తున్న ఆర్డీవో

త్వరలో అందుబాటులోకి..  


మెహిదీపట్నం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): కరోనా వైర్‌సను కట్టడి చేసేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇప్పటికే పలు ప్రధాన ఆస్పత్రుల్లో వైరస్‌ అనుమానితులను ఉంచేందుకు ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయగా, మెహిదీపట్నంలోని సరోజినీ దేవి ప్రభుత్వ కంటి ఆస్పత్రిలోనూ కరోనా వైరస్‌ అనుమాతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.


కలెక్టర్‌ శ్వేతామహంతి ఆస్పత్రిని సందర్శించి, 150 పడకలకు అవసరమైన వార్డులను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజలింగంతో కలిసి ఎంపిక చేశారు. దీంతో వార్డుల్లోని పాత వస్తువులు, చెత్త చెదారం తొలగించే పనులు యుద్ధ ప్రాతిపదినక చేపడుతున్నారు. వార్డులకు రంగులు వేస్తున్నారు. సుమారు వంద మంది కార్మికులు ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆస్పత్రి హెల్త్‌ అండ్‌ శానిటేషన్‌ విభాగం కార్మికులు వార్డులను శుభ్రం చేస్తున్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వీరేషం పర్యవేక్షణలో పనులు సాగుతున్నాయి. 


పగలూ.. రాత్రి పనులు

ఈ పనులను ఆర్డీవో శ్రీనుతో పాటు ఆసి్‌ఫనగర్‌ తహసీల్దార్‌ విష్ణుసాగర్‌ ఇతర అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరో ఐదు రోజుల్లో ఆస్పత్రిని సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆదేశించిన నేపథ్యంలో  పగలు, రాత్రి అనే తేడా లేకుండా పనులు చేస్తున్నారు.  


ప్రత్యేక దారి.. 

కరోనా అనుమానితుల కోసం ఆస్పత్రి వెనుక భాగం నుంచి ప్రత్యేక దారిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ప్రహరీతో పాటు గేటును తొలగించారు. ఆస్పత్రికి ఒకే గేటు ఉండడంతో ఈ రెండో గేటును ఏర్పాటు చేస్తున్నారు.   

Updated Date - 2020-03-18T09:20:14+05:30 IST