సప్తపర్ణి ఆర్ట్‌ గ్యాలరీలో కారా ఫిలిం ఫెస్టివల్‌

ABN , First Publish Date - 2020-11-03T09:30:05+05:30 IST

సప్తపర్ణి ఆర్ట్‌ గ్యాలరీలో కారా ఫిలిం ఫెస్టివల్‌ ఉత్సవాల్లో భాగంగా ఓ ప్రదర్శనశాలలో ఆధునిక చిత్రకళ ప్రదర్శనలు జరిగాయి. మరో ప్రదర్శన శాలలో జానపద ఆదివాసి సంగీత వాద్యాలు, తెలుగు ప్రాచీన రాతప్రతుల

సప్తపర్ణి ఆర్ట్‌ గ్యాలరీలో కారా ఫిలిం ఫెస్టివల్‌

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): సప్తపర్ణి ఆర్ట్‌ గ్యాలరీలో కారా ఫిలిం ఫెస్టివల్‌ ఉత్సవాల్లో భాగంగా ఓ ప్రదర్శనశాలలో ఆధునిక చిత్రకళ ప్రదర్శనలు జరిగాయి. మరో ప్రదర్శన శాలలో జానపద ఆదివాసి సంగీత వాద్యాలు, తెలుగు ప్రాచీన రాతప్రతుల, డోక్రా లోహ కళాకృతుల ప్రదర్శనలు జరిగాయి. అధ్యక్షత వహించిన సప్తపర్ణి డైరెక్టర్‌ గుణుపాటి అనురాధారెడ్డి మాట్లాడుతూ.. అంతరించే ప్రమాదమున్న తెలుగు చిత్రకళలు, హస్తకళలు ప్రపంచానికి తెలియజేయడానికే ఈ ప్రదర్శనలను ఏర్పాటు చేశామన్నారు. ఆయా ప్రదర్శనల నిర్వహణకు కళారూపాలను సేకరించిన తెలుగు యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు మాట్లాడుతూ.. అంతరించి పోతున్న కళలను గుర్తించి ఆయా కళాకారులకు చేయూతనివ్వాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. ఆదిధ్వని సంస్థ, సప్తపర్ణితో కలిసి వారిని ఆదుకోడానికి ముందుకు రావడాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమానికి కళాకారులు, కళాపోషకులు పలువురు హాజరయ్యారు. 

Updated Date - 2020-11-03T09:30:05+05:30 IST