19న సంక్రాంతి పురస్కారాలు
ABN , First Publish Date - 2020-12-31T04:55:48+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ రైతు దంపతులను గుర్తించి జనవరి 19న గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల సంయుక్తాధ్వర్యంలో సంక్రాంతి పురస్కారాలను అందజేయనున్నట్లు గాంధీ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్‌రెడ్డి తెలిపారు.

ముషీరాబాద్, డిసెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ రైతు దంపతులను గుర్తించి జనవరి 19న గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల సంయుక్తాధ్వర్యంలో సంక్రాంతి పురస్కారాలను అందజేయనున్నట్లు గాంధీ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం వ్యవసాయ రంగ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డిని కలిసి పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రం అందజేశారు. రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ఇబ్రహీంపట్నంలోని రాంచంద్ర ప్రకృతి ఆశ్రమంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గో ఆధారిత వ్యవసాయం చేసే వారికి ఆవు దూడలను పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో గాంధీ సంస్థల ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు గోవర్ధన్, పావని, సూర్యకళ, సంతో్‌షగుప్త, నాగమణి, దశరథ్‌గౌడ్, రాధిక, వాణి తదితరులు పాల్గొన్నారు.