గుండెపోటుతో పారిశుధ్య కార్మికురాలి మృతి

ABN , First Publish Date - 2020-06-26T09:45:48+05:30 IST

పారిశుధ్య కార్మికురాలు పనిముగించుకుని టిఫిన్‌ చేస్తుండగా గుండెపోటు వచ్చి మృతి చెందింది.

గుండెపోటుతో పారిశుధ్య కార్మికురాలి మృతి

దిల్‌సుఖ్‌నగర్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): పారిశుధ్య కార్మికురాలు పనిముగించుకుని టిఫిన్‌ చేస్తుండగా గుండెపోటు వచ్చి మృతి చెందింది. బండ్లగూడ ఆనంద్‌నగర్‌కు చెందిన కాటెపాక సుజాత(50) సరూర్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో పారిశుధ్య కార్మికురాలిగా విధులు నిర్వర్తిస్తోంది. గురువారం ఉదయం చైతన్యపురి డివిజన్‌ పరిధిలోని సాయినగర్‌, సత్యనారాయణపురం కాలనీల్లో రోడ్లను ఊడ్చిన తర్వాత స్థానికంగా ఉన్న టిఫిన్‌ సెంటర్‌లో టిఫిన్‌ చేస్తుండగా గుండె నొప్పి రావడంతో కుప్పకూలింది. దీంతో టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకులు, స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు.

Updated Date - 2020-06-26T09:45:48+05:30 IST