పోలీసుల సేవలకు సెల్యూట్‌ : నటి మంచు లక్ష్మి

ABN , First Publish Date - 2020-07-20T09:57:08+05:30 IST

కరోనా విస్తరిస్తున్న వేళ ప్రజల కోసం కుటుంబాన్ని పట్టించుకోకుండా పోలీసులు విధులు నిర్వహించారని, వారి సేవలు

పోలీసుల సేవలకు సెల్యూట్‌ : నటి మంచు లక్ష్మి

హైదరాబాద్‌ సిటీ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): కరోనా విస్తరిస్తున్న వేళ ప్రజల కోసం కుటుంబాన్ని పట్టించుకోకుండా పోలీసులు విధులు నిర్వహించారని, వారి సేవలు అద్బుతమని నటి మంచు లక్ష్మి కొనియాడు. కరోనా సోకి చికిత్స అనంతరం విధుల్లో చేరిన పోలీసులకు ఆమె మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఆన్‌లైన్‌లో పోలీసులను అభినందిస్తూ వీడియో పోస్ట్‌ చేశారు లాక్‌డౌన్‌ సమయంలో పోలీసులు ఎంతో కష్టపడి పనిచేసిన విషయం అందరూ కళ్లారా చూశారని,   ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పనిచేసిన పోలీసులే నిజమైన దేవుళ్లన్నారు. వారి సేవలకు సెల్యూట్‌ చేశారు. ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలిపినా ఈ రుణం తీరదన్నారు. 

Updated Date - 2020-07-20T09:57:08+05:30 IST