‘హక్కు’ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

ABN , First Publish Date - 2020-03-02T09:33:49+05:30 IST

సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమ లు చేయడం లేదని, దీంతో ఈ చట్టం నిరాదరణకు, నిర్వీర్యానికి గురవుతోందని పలువురు వక్తలు అన్నారు.

‘హక్కు’ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

త్వరలోనే పోర్టల్‌..


పంజాగుట్ట, మార్చి 1 (ఆంధ్రజ్యోతి):  సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమ లు చేయడం లేదని, దీంతో ఈ చట్టం నిరాదరణకు, నిర్వీర్యానికి గురవుతోందని పలువురు వక్తలు అన్నారు. హక్కు చట్టాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజా ఆలోచనా వేదిక, సమాచార హక్కు ప్ర జా నిఘా సమితి, సమాచార హక్కు సాధన సమితిల ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమాచార హక్కు చట్టం అమలు జరుగుతున్న తీరుపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్రంలోని వివిధ ప్రాం తాలకు చెందిన సమాచార హక్కు కార్యకర్తలు, ప్రతినిధులు పాల్గొన్నారు.


నేటికీ సమాచారం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి, సమాచారం ఎలా రాబట్టాలి, తదితర అంశాలపైన ప్రజలకు అవగాహన లేదని, సమాచారం కోసం అడిగితే అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (న్యూఢిల్లీ) చైర్మన్‌ డాక్టర్‌ భా స్కర్‌రావు మాట్లాడుతూ సామాన్యుడికి ప్రశ్నించే హక్కును కల్పించిన సమాచార హక్కు చట్టం గత కొద్ది సంవత్సరాల నుంచి సక్రమంగా అమలు కావడం లేదన్నారు. రాష్ట ఎన్నికల నిఘా కమిటీ కన్వీనర్‌ వీవీ రావు మాట్లాడుతూ కొందరి చర్యల వల్ల సమాచార హక్కు చట్టం పూర్తిస్థాయిలో సామాన్యుడికి చేరడం లేదన్నారు. సమాచార హక్కు మాజీ కమిషనర్‌ ఆర్‌. దిలీ్‌పరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఎవరైనా పిటీషన్‌ వేస్తే సత్వర న్యాయం దొరకడం లేదని, అనేక సంవత్సరాలు కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయన్నారు.


ప్రజా ఆలోచన వేది క వ్యవాస్థపకులు ఉప్పల గోపాల్‌రావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కోసం త్వరలోనే పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. సమాచార హక్కు చట్టం కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌ వి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి కార్యాలయంలో పీఐవో, ఏపీఐవోలను పెట్టుకోవాలి కానీ... ఆయా పోస్టుల్లో అధికారుల స్థానంలో జూనియర్‌ అసిస్టెంట్‌లు, సీనియర్‌ అసిస్టెంట్‌లను నియమిస్తున్నారని, ఇది మంచిది కాదని ఆయన అన్నారు. కార్యక్రమంలో సమాచార హక్కు సాధారణ సమితి హైపవర్‌ కమిటీ చైర్మన్‌ సంతో్‌షరెడ్డి, రాష్ట్ర కన్వీనర్‌ జి. మధుకుమార్‌, రమేష్‌ నాయక్‌, శేషగిరి పాల్గొన్నారు.  

Updated Date - 2020-03-02T09:33:49+05:30 IST