పోలీసు సిబ్బందికి రివార్డులు
ABN , First Publish Date - 2020-06-23T10:35:03+05:30 IST
విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి సీపీ అంజనీకుమార్ ‘కీ ఫెర్మార్మెన్స్ ఇండికేటర్స్’ రివార్డులను అందించారు.

108 మందికి అందించిన సీపీ
హైదరాబాద్ సిటీ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి సీపీ అంజనీకుమార్ ‘కీ ఫెర్మార్మెన్స్ ఇండికేటర్స్’ రివార్డులను అందించారు. సోమవారం కమిషనరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు మొత్తం 108 మందికి రివార్డులను అందించారు. ఇందులో ఇన్‌స్పెక్టర్ స్థాయి నుంచి హోంగార్డు వరకు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన రివార్డులు పొందిన వారిని అభినందించారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ అవినాష్ మహంతి పాల్గొన్నారు.