రేపు ఢిల్లీకి రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-12-16T01:13:51+05:30 IST

తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ చుట్టు తిరుగుతున్నాయి. బుధవారం ఢిల్లీకి ఎంపీ రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు డిఫెన్స్ కమిటీ సమావేశంలో

రేపు ఢిల్లీకి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ చుట్టు తిరుగుతున్నాయి. బుధవారం ఢిల్లీకి ఎంపీ రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు డిఫెన్స్ కమిటీ సమావేశంలో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నూతన సారధి ఎంపిక ఆపార్టీ నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం కసరత్తు జరుగుతున్న వేళ రేవంత్ ఢిల్లీ పర్యటనపై ఆసక్తి రేపుతోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో మొదటిగా వినిపిస్తున్న పేరు రేవంత్ రెడ్డి. ఇటీవల టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణకు కొత్త రథసారధిని నియమించే పనిలో అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ మేరకు ఏఐసీసీ కసరత్తు ప్రారంభించింది.


కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మాణికం ఠాగూర్ తెలుసుకున్నారు. రాష్ట్రంలోని పార్టీ నుంచి పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచీ అభిప్రాయాలనూ మాణిక్కం ఠాగూర్‌ తీసుకోనున్నారు. పీసీసీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు ఇప్పటికే ప్రారంభించింది. ఈ మేరకు ఐదుగురి పేర్లతో కూడిన జాబితా కాంగ్రెస్ అధిష్టానం వద్దకు చేరినట్లు తెలుస్తోంది. ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలిసి వచ్చారు. ఆ వెంటనే బీజేపీ నేత బండి సంజయ్ కూడా ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.

Updated Date - 2020-12-16T01:13:51+05:30 IST