బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని గవర్నర్‌కు వినతి
ABN , First Publish Date - 2020-10-07T08:51:01+05:30 IST
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు గడి చినా దళితులపై అత్యాచారాలు ఆగడంలేదని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర

పద్మారావునగర్, అక్టోబర్ 6(ఆంధ్రజ్యో తి): దేశానికి స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు గడి చినా దళితులపై అత్యాచారాలు ఆగడంలేదని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఆరేపల్లి రాజేందర్, ప్రధాన కార్యదర్శి నర్సింహ, ప్రొఫెసర్ మురళీదర్శన్, ప్రొఫెసర్ ఆనంద్‌కిషోర్, సి.బి.ప్రసాద్, రమేష్ అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో యువతిపై అత్యాచారం, హత్య ఘటనపై కేం ద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని, అలహాబా ద్ హైకోర్టు జడ్జి ద్వారా ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి బాధితురాలి కుటుంబానికి సత్వ ర న్యాయం అందేలా చూడాలని వారు కోరారు. మంగళవారం వారు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళిసైని కలిసి వినతిపత్రం అందజేశారు. బాధితురాలి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహా రం చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.