అల్లుడిని చంపిన అత్తకు రిమాండ్‌

ABN , First Publish Date - 2020-10-31T07:55:24+05:30 IST

అల్లుడిని అతి కిరాతకంగా నరికి హతమార్చిన అత్తను ఉప్పల్‌ పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు పంపారు. అల్లుడితో తన తల్లికి ఉన్న అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న కుమార్తె ఆత్మహత్య చేసుకున్న

అల్లుడిని చంపిన అత్తకు రిమాండ్‌

ఉప్పల్‌, అక్టోబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): అల్లుడిని అతి కిరాతకంగా నరికి హతమార్చిన అత్తను ఉప్పల్‌ పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు పంపారు. అల్లుడితో తన తల్లికి ఉన్న అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న కుమార్తె ఆత్మహత్య చేసుకున్న అనంతరం అక్రమ సంబందం బెడిసికొట్టింది. దీంతో తాజాగా శుక్రవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న అల్లుడు పేరం నవీన్‌కుమార్‌ను రామంతాపూర్‌లోని అద్దె ఇంట్లో అనిత(38) హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే హత్య చేసిన అనంతరం అనిత నేరుగా శుక్రవారం తెల్లవారుజామున ఉప్పల్‌ పోలీ్‌సస్టేషన్‌కు వచ్చి లొంగిపోయింది. కూతురు ఆత్మహత్య కేసులో అనితతో పాటు అల్లుడు నవీన్‌కుమార్‌ కూడా జైలుకు వెళ్లి బెయిలుపై వచ్చాక 15 రోజులుగా రామంతాపూర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని ఇద్దరు కలిసి జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రం కావడంతో నవీన్‌కుమార్‌ హత్య జరిగింది. ఉప్పల్‌ పోలీసులు అనితపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read more