భార్యాభర్తలకు రిమాండ్‌

ABN , First Publish Date - 2020-08-16T09:44:01+05:30 IST

నిలిపిన బైకులో నుంచి నగదును దొంగలించిన భార్యాభర్తలను లాలాగూడ పోలీసులు అరెస్టు చేశారు.

భార్యాభర్తలకు రిమాండ్‌

బైకు డిక్కీలోని నగదు చోరీ చేసిన కేసులో


అడ్డగుట్ట, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): నిలిపిన బైకులో నుంచి నగదును దొంగలించిన భార్యాభర్తలను లాలాగూడ పోలీసులు అరెస్టు చేశారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. తార్నాకకు చెందిన ఎల్లకంటి కృష్ణారావు ఈనెల 4న మధ్యాహ్నం తార్నాకలోని ఎస్‌బీఐ (ఎన్‌ఎన్‌ఎన్‌) బ్రాంచ్‌లో రూ 1.70 లక్షల నగదు డ్రా చేసుకొని తన యాక్టీవా బైకులో పెట్టాడు. ఎస్‌ఆండ్‌టీ వర్క్‌షాపు వద్ద తన బైకును నిలిపి పని నిమిత్తం బయటకెళ్లాడు. ఆ సమయంలో ఆసి్‌ఫనగర్‌కు చెందిన భార్యాభర్తలు సయ్యద్‌ అతీఫ్‌ (55), అతడి భార్య సయ్యద్‌ ఉమ్మేహానీ (31)లు బ్యాంకు నుంచి కృష్ణారావును ఫాలో అయి ఎస్‌ఆండ్‌టీ వర్క్‌షాపు వద్ద బైక్‌ను నిలపడాన్ని గమనించి డిక్కీలో ఉన్న రూ 1.70 లక్షలను ఎత్తుకెళ్లిపోయారు. బాధితుడు వెంటనే లాలాగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.


సీసీ ఫుటేజీని పరిశీలించగా ఆసి్‌ఫనగర్‌కు చెందిన బార్యాభర్తలుగా గుర్తించారు. ఈనెల 14న మెట్టుగూడ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేశారు. బైకుపై భార్యాభర్తలు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకుని విచారించగా నిజాన్ని ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి వారి నుంచి రూ. 70 వేలు రికవరీ చేశారు. ఈ దంపతులు నగరంలోని పలు ఠాణాల పరిధిలో చోరీలు చేశారని, ఇటీవలనే బెయిల్‌పై బయటకొచ్చారని పోలీసులు చెప్పారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఎస్సైలు మల్లయ్య, కోటేశ్వర్‌రావు పాల్గొన్నారు.    

Updated Date - 2020-08-16T09:44:01+05:30 IST