ధరణి వల్ల రిజిస్ట్రేషన్లు అస్తవ్యస్తంగా మారాయి: మురళీధరరావు
ABN , First Publish Date - 2020-12-19T20:42:38+05:30 IST
ధరణి వ్యవస్థ విఫల ప్రయత్నమని బీజేపీ నేత మురళీధర్‌రావు అన్నారు. ధరణి వల్ల రిజిస్ట్రేషన్లు అస్తవ్యస్తంగా మారాయని ఆరోపించారు.

హైదరాబాద్: ధరణి వ్యవస్థ విఫల ప్రయత్నమని బీజేపీ నేత మురళీధర్‌రావు అన్నారు. ధరణి వల్ల రిజిస్ట్రేషన్లు అస్తవ్యస్తంగా మారాయని ఆరోపించారు. దొంగ రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ధరణి స్వర్గధామమన్నారు. ధరణిలో లింక్ డాక్యుమెంట్ల వివరాలు లేవని తెలిపారు. ధరణి రిజిస్ట్రేషన్లపై హైకోర్టుకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని మురళీధరరావు తప్పుబట్టారు. ధరణి వ్యవస్థ రాష్ట్ర రెవెన్యూ లోటుకి కారణమైందని, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేశారు. బిల్డర్ల ఆందోళనకు బీజేపీ మద్దతు ఇస్తుందని మురళీధరరావు ప్రకటించారు.