వాహనదారులపై కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-04-12T09:36:59+05:30 IST
దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం పాతబస్తీలోని వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో లాక్‌డౌన్‌ను ..

చార్మినార్/పహడీషరీప్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం పాతబస్తీలోని వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో లాక్‌డౌన్‌ను అతిక్రమించి వాహనాలు నడుపుతున్న వందమంది యువకులను పట్టుకున్నారు. వారి వాహనాలను ఆయా పోలీ్‌సస్టేషన్‌లకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ నేతృత్వంలో ఈ దాడులను నిర్వహించారు.
నార్సింగ్‌లో..
నార్సింగ్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్ నేపథ్యంలో నార్సింగ్ పోలీసులు ఆయా ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి అవసరం లేకున్నా రోడ్లపైన విచ్చలవిడిగా తిరుగుతున్న వారి వాహనాలను సీజ్ చేస్తునాన్నారు. కేవలం మూడు నెలల్లో 1,01,937 ఓవర్ స్పీడు కేసులు నమోదు చేశారు. వాటికి రూ. 1000 చొప్పున రూ. 10,19,3700లు జరిమానాలు విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు.