వంద మందితో రిసెప్షన్
ABN , First Publish Date - 2020-05-18T09:15:19+05:30 IST
భూదేవినగర్‌లోని శివానగర్ పరిసర ప్రాంతంలో ఓ కుటుంబం ఆదివారం వివాహ రిసెప్షన్ నిర్వహించింది.

పోలీసుల చర్యలు
అల్వాల్, మే 17 (ఆంధ్రజ్యోతి) : భూదేవినగర్‌లోని శివానగర్ పరిసర ప్రాంతంలో ఓ కుటుంబం ఆదివారం వివాహ రిసెప్షన్ నిర్వహించింది. భౌతిక దూరం పాటించకుండా వంద మందికిపైగా బంధువులతో వేడుక చేస్తోంది. విషయం తెలుసుకున్న స్థానికులు అల్వాల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ ఇంత మందితో రిసెప్షన్ జరపకూడదని పోలీసులు ఆ కుటుంబ సభ్యులకు వివరించారు. అనంతరం రోడ్డుకు అడ్డంగా వేసిన టెంట్‌ను కూడా తొలగించారు.