‘రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలి’
ABN , First Publish Date - 2020-09-03T10:18:55+05:30 IST
తెలంగాణకు అన్యాయం చేసే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు

రాంనగర్, సెప్టెంబర్ 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణకు అన్యాయం చేసే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలుపుదలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్ర మూ చిత్తశుద్ధి లేదన్నారు. బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 5న సమావేశంలో, ఆగస్టు 17 నాటి టెండర్ల రద్దు కోసం అఫెక్స్ కమిటీలో ప్రస్తావించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా వదులకుందని ఆరోపించారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా టెండర్‌లపై స్టే పొందే అవకాశాన్ని కూడా వదులుకుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.