ఏకాగ్రత, ధ్యానంపై రామకృష్ణ మఠం ఆన్ లైన్ కోర్సు

ABN , First Publish Date - 2020-12-28T22:39:28+05:30 IST

నగరంలోని రామకృష్ణ మఠానికి చెందిన వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్(వీఐహెచ్ఈ) నిర్వహిస్తున్న ఏకాగ్రత, ధ్యానంపై ఆన్ లైన్ కోర్సు

ఏకాగ్రత, ధ్యానంపై రామకృష్ణ మఠం ఆన్ లైన్ కోర్సు

హైదరాబాద్: నగరంలోని రామకృష్ణ మఠానికి చెందిన వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్(వీఐహెచ్ఈ) నిర్వహిస్తున్న ఏకాగ్రత, ధ్యానంపై ఆన్ లైన్ కోర్సు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 28 నుంచి జనవరి 1 వరకు సాగే ఈ ఐదు రోజుల తరగతులకు వీఐహెచ్ఈ డైరెక్టర్ స్వామి బోధమయానంద, భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ హాజరుకానున్నారు. తరగతులకు 16-60ఏళ్ల లోపు వారు మాత్రమే అర్హులు. సాయంత్రం 6.15 గంటల నుంచి 7.15 గంటల వరకు క్లాస్ జరగనుంది. 


ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు.   


మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.

Updated Date - 2020-12-28T22:39:28+05:30 IST