దక్షిణమధ్యరైల్వే-ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ మధ్య అవగాహన ఒప్పందం

ABN , First Publish Date - 2020-12-17T07:12:24+05:30 IST

సిబ్బందికి సామర్థ్యంలో వృద్ధి, పరిశోధన రంగంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల

దక్షిణమధ్యరైల్వే-ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ మధ్య అవగాహన ఒప్పందం
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు

సికింద్రాబాద్‌, డిసెంబర్‌ 16 (ఆంధ్రజ్యోతి): సిబ్బందికి సామర్థ్యంలో వృద్ధి, పరిశోధన రంగంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల నిర్వహణ కోసం భారతీయ రైల్వే, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌తో అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించింది. దీంతోపాటు కృత్రిమ మేథస్సు, డాటా విశ్ల్లేషణ కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయడం, ఇంటిగ్రేటెడ్‌ కోల్‌-ఫ్రైట్‌ ఆప్టిమైజేషన్‌ మోడల్‌ తదితర అంశాలపై ఒప్పంద పత్రాలను  దక్షిణమధ్యరైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య సమక్షంలో బుధవారం ఖరారు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ కె.శివప్రసాద్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ జె.కె.జెయిన్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ కిషోర్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ డిప్యూటీ డీన్‌ మిలింద్‌ సోహోని పాల్గొన్నారు.

Updated Date - 2020-12-17T07:12:24+05:30 IST