సామాజిక దూరాన్ని పాటించడం లేదు : మహేష్ భగవత్
ABN , First Publish Date - 2020-03-24T09:39:09+05:30 IST
కరోనా వైర్‌సపై విస్తృత ప్రచారం ఉన్నా.. ప్రజలు సామాజిక దూరాన్ని పాటించడంలేదని రాచకొండ సీపీ మహే్‌షభగవత్ అన్నారు.

నేరేడ్‌మెట్, మార్చి23 (ఆంధ్రజ్యోతి) : కరోనా వైర్‌సపై విస్తృత ప్రచారం ఉన్నా.. ప్రజలు సామాజిక దూరాన్ని పాటించడంలేదని రాచకొండ సీపీ మహే్‌షభగవత్ అన్నారు. సోమవారం నేరేడ్‌మెట్‌లోని సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే సమయంలో ప్రభుత్వం సూచించిన సామాజిక దూరాన్ని ప్రజలు పాటించకుండా గుంపులుగా కొనుగోలు చేస్తున్నారన్నారు. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మనిషికి, మనిషికి మధ్య కనీసం మీటరు దూరం పాటించాలన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు పాజిటివ్ కరోనా కేసులు నమోదయ్యాయన్నారు.
ఒకటి నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో కాగా రెండోది చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైందన్నారు. ముందుగా ట్రాఫిక్ పెట్రోలింగ్ కోసం సుజుకీ కంపెనీవారు అందజేసిన 10 బైక్‌ల ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఒక్కో బైక్ రూ.2 లక్షల 30 వేల ధర ఉందని, రాచకొండ ట్రాఫిక్ పోలీసులకు బైకులు అందజేసిన కంపెనీ వారిని, డీలర్ చంద్రశేఖర్‌రెడ్డిని ఆయన అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో రాచకొండ డీసీపీ శిల్పవళ్లి, ఇతర పోలీసు అధికారులు, ట్రాఫిక్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.