500 కుటుంబాలకు నిత్యావసరాల అందజేత
ABN , First Publish Date - 2020-04-05T09:28:04+05:30 IST
కేపీహెచ్‌బీ డివిజ న్ పరిధిలోని శ్రీలా పార్కు ప్రైడ్ కాలనీవాసులు మియాపూర్ హఫీజ్‌పేటలో నివాసముండే 500 కుటుంబాలకు 10 రోజులకు సరిపడా

కేపీహెచ్‌బీకాలనీ, ఏప్రిల్4 (ఆంధ్రజ్యోతి): కేపీహెచ్‌బీ డివిజ న్ పరిధిలోని శ్రీలా పార్కు ప్రైడ్ కాలనీవాసులు మియాపూర్ హఫీజ్‌పేటలో నివాసముండే 500 కుటుంబాలకు 10 రోజులకు సరిపడా నిత్యావసరాలను శనివారం అందించారు. అపోలో ఆస్పత్రి సీఈవో సుబ్రమణ్యం, మియాపూర్ సీఐ వెంకటేష్ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు కాలనీ అధ్యక్షుడు అల్లూరి మురళీకృష్ణ తెలిపారు.
1300 ఇళ్లకు నిత్యావసరాల పంపిణీ..
బోడుప్పల్: పీర్జాదిగూడ 16వ డివిజన్ కార్పొరేటర్ బండి రమ్యా సతీ్‌షగౌడ్ డివిజన్ పరిధిలో ఉన్న 1300 ఇళ్లకు నిత్యావసర సరుకులను శనివారం అందజేశారు. కార్యక్రమంలో కృష్ణంరాజు, బండి శ్రీరాములుగౌడ్, పప్పుల అంజిరెడ్డి, రమేష్ నాయుడు, రఘువర్ధన్‌రెడ్డి, నరసింహారావు, రాజేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీలో ఆహార పొట్లాల పంపిణీ..
కూకట్పల్లి: తెలంగాణ స్ర్టీట్ వెండర్స్ అండ్ హాకర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కేపీహెచ్‌బీ కాలనీలోని రోజువారీ కూలీలు, పేదలకు ఆహార పొట్లాలను అందజేశారు. స్థానిక వీధి వ్యాపారులు ఇంట్లో స్వయంగా వండిన ఆహారాన్ని పేదలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి.రఘు, మల్లేష్, నాగేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.