కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 23న నిరసనలు

ABN , First Publish Date - 2020-07-18T09:55:17+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 23న మండల కేంద్రాల్లో కార్మికులు, రైతులు నిరసన తెలపాలని

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 23న నిరసనలు

చిక్కడపల్లి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 23న మండల కేంద్రాల్లో కార్మికులు, రైతులు నిరసన తెలపాలని అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఆర్టీసీక్రా్‌సరోడ్స్‌లోని కిసాన్‌సభ రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.జంగారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 1న గ్రామపంచాయతీ కార్యాలయాల ఎదుట నిరసన, ఆగస్టు 9న జైల్‌ భరో కార్యక్రమాలతో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, ప్రసాదరావు, చంద్రారెడ్డి, లక్ష్మి, శోభన్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-07-18T09:55:17+05:30 IST