కార్మిక శాఖ స్థలాన్ని పరిరక్షించండి

ABN , First Publish Date - 2020-08-14T09:58:12+05:30 IST

నగరంలోని రాంనగర్‌ డివిజన్‌ ఎస్‌ఆర్‌టీ కాలనీలోని సర్వే నంబర్‌ 113, 116గల రూ. 5 కోట్లకు పైగా విలువగల 1016

కార్మిక శాఖ స్థలాన్ని పరిరక్షించండి

జాయింట్‌ కమిషనర్‌కు కార్పొరేటర్‌, ఎస్‌ఆర్‌టీ కాలనీ అసోసియేషన్‌ ఫిర్యాదు


రాంనగర్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): నగరంలోని రాంనగర్‌ డివిజన్‌ ఎస్‌ఆర్‌టీ కాలనీలోని సర్వే నంబర్‌ 113, 116గల రూ. 5 కోట్లకు పైగా విలువగల 1016 గజాల స్థలం కబ్జా అయిందని, దీన్ని పరిరక్షించాలని కోరుతూ కార్పొరేటర్‌ వి. శ్రీనివా్‌సరెడ్డి, ఎస్‌ఆర్‌టీ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీజే జాబ్‌, ప్రధాన కార్యదర్శి రఘునాథ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సత్యనారాయణ కార్మికశాఖ జాయింట్‌ కమిషనర్‌ గంగాధర్‌కు గురువారం ఫిర్యాదు చేశారు.


ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలతోపాటు కార్పొరేటర్‌, అసోసియేషన్‌ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదులపై క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని కార్మిక శాఖ ఇన్‌చార్జి సహాయ కమిషనర్‌ రాజశేఖర్‌చారి, అధికారులు రమణమూర్తి, రజనీ, సరళ, శీరిష, బాషా తదితరుల బృందాన్ని గురువారం మధ్యాహ్నం ఒంటిగంటలకు కబ్జా అయిన స్థలం వద్దకు పంపించారు. ఆ స్థలం కార్మికశాఖదేని ప్రాథమికంగా నిర్ధారించారు. కొంతమంది స్థలాన్ని కబ్జా చేయాలని నకిలీ పత్రాలు సృష్టించినట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని, ఈ అంశంపై కోర్టులో వివాదం కొనసాగుతోందని తెలిపారు.


ఇదిలా ఉండగా ఈ స్థలంపై ఎవరికీ హక్కులు లేవని, కార్మిక శాఖదని, ఎవరైనా ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. 8, 9, 10, 11, 12, 13, 14, 15 క్వార్టర్ల యజమానుల డాక్యుమెంట్లను అధికారులు పరిశీలించారు. ఎవరైనా ఎక్కువ స్థలం ఆక్రమిస్తే స్వాధీనం చేసుకుంటామన్నారు. స్థలం పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని కార్మికశాఖ సహాయ కమిషనర్‌ రాజవేఖర్‌చారి తెలిపారు. స్థలాన్ని రక్షించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేశామని కార్పొరేటర, అసోసియేషన్‌ ప్రతినిధులు హెచ్చరించారు. ఆ స్థలంలో ప్రభుత్వ పాఠశాల, కళాశాల, బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-08-14T09:58:12+05:30 IST