ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయాలు సాధించాలి

ABN , First Publish Date - 2020-06-22T10:15:22+05:30 IST

తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే

ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయాలు సాధించాలి

రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌ 


రాజేంద్రనగర్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం మైలార్‌దేవుపల్లిలోని ఆయన నివాసంలో జయశంకర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ టి.ప్రేమ్‌దా్‌సగౌడ్‌, కేఎస్‌ దయానంద్‌, టి.ప్రేమ్‌గౌడ్‌, అక్కెం రాఘవేందర్‌యాదవ్‌, రాపోలు సత్తయ్య, కరణం రఘుముదిరాజ్‌ పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు పీర్లగూడెం వెంకటస్వామి, సరికొండ వెంకటేశ్‌, రాపోలు సత్తయ్య, సామల సత్యం, కొత్తురు వెంకటేశ్‌ నివాళులర్పించారు. 


రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహానికి వీసీ డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌.సుధీర్‌కుమార్‌, ఉన్నతాధికారులు డాక్టర్‌ ఆర్‌.జగదీశ్వర్‌, డాక్టర్‌ జెల్లా సత్యనారాయణ, డాక్టర్‌ కె.వి.ఎ్‌స.మీనాకుమారీ నివాళులర్పించారు.  


కవాడిగూడ: కవాడిగూడలోని కార్యాలయంలో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కో-కన్వీనర్‌ పులిగారి గోవర్ధన్‌రెడ్డి నివాళులర్పించారు. 


అల్లాపూర్‌: పర్వత్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ కూకట్‌పల్లి బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు రాజు, పి.శ్రీనివా్‌సరెడ్డి, నాగరాజు, లక్ష్మణ్‌గౌడ్‌, భానుప్రకాశ్‌ పాల్గొన్నారు.


రాంనగర్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌కు పద్మవిభూషణ్‌ ఇవ్వాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఆయన నివాళులర్పించారు. 


సికింద్రాబాద్‌: బోయినపల్లి జయనగర్‌ ఆటోస్టాండ్‌ వద్ద మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి, కంటోన్మెంట్‌ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్‌,  మార్కెట్‌ చైర్మన్‌ టి.ఎన్‌.శ్రీనివాస్‌ నివాళులర్పించారు. 


కుషాయిగూడ:  నగరంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేయాలని తెలంగా ణ ఉద్యమకారుల జేఏసీ వ్యవస్థాపకుడు నల్లా రాధాకృష్ణ డిమాంండ్‌ చేశారు. చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను జయశంకర్‌ ప్రాజెక్ట్‌గా నామకరణం చేయాలని విజ్ఞప్తి చేశారు.  టీయూజేఏసీ నాయకులు కనుకుం ట్ల విజయ్‌కుమార్‌, రాగిరి మోహన్‌రెడ్డి, పొన్నాల వినోద్‌, పైడిపాల శ్రీనివాస్‌, వెంకటాచారి, సతీష్‌ పాల్గొన్నారు. 


కుత్బుల్లాపూర్‌: రామకృష్ణనగర్‌ జయశంకర్‌ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి విశ్వకర్మ ఐక్యవేదిక అధ్యక్షుడు ఎన్‌.రవీంద్రచారి, జనరల్‌ సెక్రెటరీ కిషోర్‌చారి, కుత్బుల్లాపూర్‌ విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు పి.బాలరాజ్‌ నివాళులర్పించారు.  


మంగళ్‌హాట్‌:  ఇంటర్‌బోర్డు కార్యాలయంలోని జయశంకర్‌  విగ్రహానికి టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ఇంటర్‌ విద్యా జేఏసీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, టీఎన్జీవో హైదరాబాద్‌ అధ్యక్షుడు ప్రతాప్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు శ్రీరాం నివాళులర్పించారు.  


అల్వాల్‌: అల్వాల్‌లోని ఈ సేవా చౌరస్తా వద్ద  మల్కాజిగిరి నియోజకవర్గ జేఏసీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, టీజేఎస్‌ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. లక్ష్మణ్‌, సురేష్‌, రవి పాల్గొన్నారు.  


అఫ్జల్‌గంజ్‌: ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్‌, నరేంద్ర, కృష్ణగౌడ్‌, సంత్‌ నారాయణ్‌ వ్యాస్‌ నివాళులర్పించారు. 


సరూర్‌నగర్‌: టీఆర్‌ఎస్‌ బాలాపూర్‌ మండల మాజీ అధ్యక్షుడు బి.వెంకట్రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి కొత్త మనోహర్‌రెడ్డి నివాళులర్పించారు. 


చంపాపేట: చంపాపేటలోని జయశంకర్‌ విగ్రహానికి టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు నల్లా రఘుమారెడ్డి, వార్డుసభ్యులు ముడుపు రాజిరెడ్డి, సతీ్‌షగౌడ్‌,   బైగళ్ల రాము, ప్రభాకర్‌, రవిముదిరాజ్‌, జంగయ్య, శేఖర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, మల్లే్‌షగౌడ్‌, నిషికాంత్‌రెడ్డి నివాళులర్పించారు. ఉద్యమకారుడు రామ్‌లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో ఈశ్వర్‌గుప్తా, నాగభూషణ్‌, సాయి నివాళులర్పించారు. 

Updated Date - 2020-06-22T10:15:22+05:30 IST