సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ABN , First Publish Date - 2020-08-01T10:27:54+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కారానికి తాను మొదటి ప్రాధాన్యమిస్తానని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని

సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

రెజిమెంటల్‌బజార్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి తాను మొదటి ప్రాధాన్యమిస్తానని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. శుక్రవారం మోండా మార్కెట్‌ డివిజన్‌ పరిధిలోని బండిమెట్‌లో మంత్రి, వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. బండిమెట్‌కాలనీలో నూతన సివరేజీ, మంచినీటి పైపులైన్‌ పనులకు నిధులు మంజూరయ్యాయని, వెంటనే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 31 బస్టాప్‌ నుంచి పాలికాబజార్‌ వరకు వీడీసీసీ రోడ్డు నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరయ్యాయని, త్వరలో ఆ పనులను చేపడతామన్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి సంతోష్‌ స్వీట్‌హౌస్‌ వరకు చేపట్టిన రోడ్డు పనులను మంత్రి తలసాని పరిశీలించారు.

Updated Date - 2020-08-01T10:27:54+05:30 IST