ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి పీపీఈ కిట్లు

ABN , First Publish Date - 2020-07-28T09:43:57+05:30 IST

వైద్య విద్యార్థులకు ఉచితంగా పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులను అందజేసేందుకు మహేశ్వర మెడికల్‌ కాలేజీ ప్రతినిధులు

ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి పీపీఈ కిట్లు

అందజేసిన మహేశ్వర మెడికల్‌ కాలేజీ


మంగళ్‌హాట్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్యార్థులకు ఉచితంగా పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులను అందజేసేందుకు మహేశ్వర మెడికల్‌ కాలేజీ ప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయమని ఉస్మానియా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శశికళారెడ్డి అన్నారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి 500 పీపీఈ కిట్లు, 500 ఎన్‌-95 మాస్కులను మహేశ్వర మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ నవిత సోమవారం అందజేశారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళతోపాటు ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యుల కోసం ఏకకాలంలో పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులను ఉచితంగా అందించామన్నారు. కిట్లు, మాస్కులు అవసరం ఉన్న ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రులు నేరుగా తమను సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో మహేశ్వర మెడికల్‌ కాలేజ్‌ డైరెక్టర్‌ కృష్ణారావు, డాక్టర్లు గోపీకృష్ణ, మహేష్‌, రూప, శ్రీనివాస్‌, హరి, కళ్యాణ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-28T09:43:57+05:30 IST