అస్సలు తగ్గట్లే..

ABN , First Publish Date - 2020-06-22T09:48:49+05:30 IST

కరోనా గ్రేటర్‌లో కలకలం సృష్టిస్తోంది. ఒక్కో ప్రాంతంలో ఒకటి, రెండు పాజిటివ్‌ కేసుల దశ దాటి పదుల సంఖ్యలో

అస్సలు తగ్గట్లే..

రోజు రోజుకూ భారీగా పెరుగుతున్న పాజిటివ్‌లు

గడిచిన 24 గంటల్లో 659 మందికి సోకిన మహమ్మారి


హైదరాబాద్‌ సిటీ న్యూస్‌ నెట్‌వర్క్‌, జూన్‌ 21, (ఆంధ్రజ్యోతి): కరోనా గ్రేటర్‌లో కలకలం సృష్టిస్తోంది. ఒక్కో ప్రాంతంలో ఒకటి, రెండు పాజిటివ్‌ కేసుల దశ దాటి పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. అంబర్‌పేట ప్రాంతంలో ఒకే రోజు 34 కేసులు, బంజారాహిల్స్‌లో 31కేసులు నమోదయ్యాయి. రామంతాపూర్‌ వెంకట్‌రెడ్డినగర్‌కు చెందిన వ్యక్తి (50) కరోనాతో మృతి చెందాడు. జియాగూడలోని కరోనా నిర్ధారణ పరీక్ష కేం ద్రం ఇన్‌చార్జి వైద్యురాలు కరోనా బారినపడ్డారు. ఆమె కూతురు(10)కి కూడా పాజిటివ్‌గా తేలింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆదివారం రికార్డుస్థాయిలో 659 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.  


ముషీరాబాద్‌ డివిజన్‌ మోహన్‌నగర్‌లో 40 ఏళ్ల వ్యక్తి, ఆయన భార్య (32), ముషీరాబాద్‌లో 27 ఏళ్ల యువకుడు, దళిత జాతీయ సంఘం ప్రాంతంలో 35 ఏళ్ల మహిళకు కరోనా నిర్ధారణ అయింది. ఇందిరానగర్‌ ప్రాంతంలో 35 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. 


కార్వాన్‌ పరిధి గోల్కొండలో 12, లంగర్‌హౌజ్‌లో 15 పాజిటివ్‌ కేసులతోపాటు పలు ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 


రామంతాపూర్‌ గణే్‌షనగర్‌కు చెందిన వ్యక్తి (42), యువకుడు (29), వివేక్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తి (56)కు పాజిటివ్‌గా తేలింది.  


గాంధీనగర్‌ డివిజన్‌ పరిధిలో 35 ఏళ్ల వ్యక్తి కరోనా బారిన పడ్డాడు.  


కుత్బుల్లాపూర్‌లో ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంద్రసింగ్‌నగర్‌లో వృద్ధురాలు (65), రుక్మిణీ ఎస్టేట్‌ మహిళ (45), జగద్గిరిగుట్టలో వ్యక్తి (25), జీడిమెట్లలో మహిళ (48), న్యూషాపూర్‌నగర్‌లో వృద్ధుడు(60), రాజీవ్‌గాంధీనగర్‌లో వృద్ధుడు (88), మరో మహిళ (36), సూరారంలో వ్యక్తి (28)కి కరోనా సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. 


కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధి భాగ్యనగర్‌కాలనీ, దీనబంధుకాలనీ, ప్రశాంతినగర్‌ కాలనీల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మూసాపేట సర్కిల్‌ పరిధిలోని అల్లాపూర్‌, కేపీహెచ్‌బీ కాలనీల్లో ఎనిమిది కరోనా కేసులు నమోదు అయ్యాయి. 


బోడుప్పల్‌  కార్పొరేషన్‌ పరిధిలోని బాలాజీహిల్స్‌లో ఉంటూ సీపీఎల్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌, కేశవనగర్‌లో ఒకరు, మల్లికార్జున్‌నగర్‌లో ఒకరు, పీర్జాదిగూ డ మేడిపల్లి హోం విహార్‌ కాలనీలో ఉంటూ బషీర్‌బాగ్‌లో ఎస్‌ఐకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.

  

ఖైరతాబాద్‌ సర్కిల్‌ పరిధిలో 15 కరోనా కేసు లు నమోదయ్యాయి. సనత్‌నగర్‌లో ఒకే ఇంట్లో ఎనిమిది మందికి పాజిటివ్‌ రాగా, ఖైరతాబాద్‌ ఇందిరానగర్‌ కాలనీలో ఒకరు(43), అతని భార్య(38)కి పాజిటివ్‌ వచ్చింది.  ఆనంద్‌నగర్‌ కాలనీలో మహిళతోపాటు 4 సం వత్సరాల చిన్నారికి పాజిటివ్‌ వచ్చింది. ఆమె భర్తకు గతంలో కరోనా సోకింది. రాజ్‌భవన్‌ రోడ్డులో వృద్ధుడు(70), నిమ్స్‌ ఆస్పత్రి పీజీ  హాస్టల్‌లో 29 మహిళ,  ఎంఎస్‌ మక్తాలో 78 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్‌ వచ్చినట్లు సర్కిల్‌ ఏఎంసీ రవీందర్‌ తెలిపారు.  


రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధి హైదర్‌గూడలో 32వ్యక్తి, బుద్వేల్‌ బృందావన్‌కాలనీలో 56 ఏళ్ల వ్యక్తి,  హసన్‌నగర్‌ 45ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. 


అంబర్‌పేట నియోజకవర్గంలో 34 కరోనా కేసులు నమోదయ్యాయి.  అంబర్‌పేట పీఎస్‌ పరిధిలో 28, కాచిగూడ పీఎస్‌ పరిధిలో 5, నల్లకుంట పీఎస్‌  పరిధిలో ఒక కేసు నమోదు అయింది. 


జీహెచ్‌ఎంసీ యూసు్‌ఫగూడ సర్కిల్‌-19 పరిధిలో 18 కోరోనా పాజిటవ్‌ కేసులు నమోదయ్యా యి. యూసు్‌ఫగూడ లక్ష్మీనర్సింహానగర్‌లో ఒకరు (38), ఎర్రగడ్డలో ఒకరు(37), యూసు్‌ఫగూడలో మహిళ(49), బోరబండలో ఒకరు (42), స్వరాజ్‌నగర్‌లో ఒకరు (45), ఎర్రగడ్డలో ఒకరు(20), యూసు్‌ఫగూడలో ఒకరు(33), రహ్మత్‌నగర్‌లో మహిళ(55), బాబానగర్‌లో మహిళ(30), రాజ్‌నగర్‌లో ఒకరు(32), రహ్మత్‌నగర్‌లో మహిళ(23), ప్రేమ్‌నగర్‌లో ఒకరు (36), సాయిబాబానగర్‌లో మహిళ(48), జవహర్‌నగర్‌లో ఒకరు(50), వినాయక్‌నగర్‌లో ఒకరు (66), శ్రీకృష్ణనగర్‌లో బాలిక(11), మరో బాలుడు, బోరబండలో ఒకరు (32) కరోనా బారిన పడ్డారు. 


ఉప్పల్‌ బీరప్పగడ్డలో ఓ వ్యక్తికి కరోనా సోకగా, ఉప్పల్‌లో నివాసం ఉంటూ ఓ తెలుగు దినపత్రిలో కేంద్ర కార్యాలయంలో పనిచేసే ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఉప్పల్‌ స్వరూ్‌పనగర్‌లో ఇద్దరు చానల్‌ రిపోర్టర్లకు కరోనా సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. 


అల్లాపూర్‌ డివిజన్‌ గాయత్రీ నగర్‌లో 31 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ  అయినట్లు వైద్యాధికారులు ప్రకటించారు. 


కింగ్‌ కోఠి ఆస్పత్రిలో  81 మందికి.. 

కింగ్‌ కోఠి ఆస్పత్రిలో ఒక్కరోజులో 81 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఆదివారం ఆస్పత్రి ఓపీకి 104 మంది రాగా, 10 మంది ఇన్‌పేషెంట్లుగా చేరారు. వీరిలో 56 మంది నుంచి నమూనాలు సేకరించారు. గతంలో పరీక్షలు చేసిన వారిలో 81మందికి పాజిటివ్‌గా, మరో 42 మందికి నెగిటివ్‌గా ఫలితాలు వచ్చాయి. ఇంకా 195 మంది పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. 


జియాగూడలో ఆరు రోజులుగా 938 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు చేయగా, 150 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ ప్రాంతంలో ఉన్న అనుమానితులకు పది రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తామని వైద్యాధికారులు తెలిపారు. 


అంబర్‌పేట ప్రభుత్వ సీపీఎల్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఈనెల 16 నుంచి ఇప్పటి వరకు 816 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.  


ఎర్రగడ్డలోని చెస్ట్‌ ఆస్పత్రిలో ఆదివారం రెండు కరోనా కేసులు వచ్చాయి. అనుమానితులు 69 మంది ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ ఖాన్‌ తెలిపారు. ఆయుర్వేద ఆస్పత్రిలో మొత్తం 45 కరోనా పాజిటివ్‌ కేసులకు చికిత్సను అందిస్తున్నామని   సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పరమేశ్వర్‌ నాయక్‌ తెలిపారు. 


 బంజారాహిల్స్‌ ప్రాంతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు రికార్డు స్థాయిలో 31 కరోనా కేసులు నమోదు అయ్యాయి. బంజారాహిల్స్‌రోడ్డు నెంబరు 12, ఫిలింనగర్‌ ప్రాంతాల్లో అత్యధిక కేసులు వచ్చాయి. రోడ్డు నెంబరు 12 ఎమ్మెల్యే కాలనీలో నివాసముండే కస్టమ్స్‌ జాయింట్‌ కమిషనర్‌కు పాజిటివ్‌గా తేలింది. ఇదే కాలనీలో నలుగురికి, ఎన్‌బీటీనగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  ఫిలింనగర్‌లో నివాసముండే ఓ కానిస్టేబుల్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు నలుగురికి కరోనా సోకింది. ఫిలింనగర్‌ రోడ్డు నెంబరు 7లో నలుగురికి కరోనా నిర్ధారణ అయింది. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 7,10,14లో రెండేసి కేసులు నమోదు అళీ్యూయి.

Updated Date - 2020-06-22T09:48:49+05:30 IST