తెలంగాణలో బీజేపీకి తిరుగులేదు

ABN , First Publish Date - 2020-12-11T06:59:56+05:30 IST

తెలంగాణలో బీజేపీ ఆదరణ లేదు అన్నవారికి గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రజలు కళ్లు తెరిపించారని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ తిరుగులేని పార్టీగా ఎదుగుతుందని ఆపార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

తెలంగాణలో బీజేపీకి తిరుగులేదు
వినాయకనగర్‌ కార్పొరేటర్‌ క్యాసం రాజ్యలక్ష్మిని సన్మానిస్తున్న డాక్టర్‌ లక్ష్మణ్‌

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె లక్ష్మణ్‌

వినాయకనగర్‌, డిసెంబర్‌ 10(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీజేపీ ఆదరణ లేదు అన్నవారికి గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రజలు కళ్లు తెరిపించారని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ తిరుగులేని పార్టీగా ఎదుగుతుందని ఆపార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ పేర్కొన్నారు. మల్కాజిగిరి సర్కిల్‌ వినాయకనగర్‌ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన బీజేపీ అభ్యర్థి క్యాసం రాజ్యలక్ష్మి గురువారం ముషీరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో డా. కె లక్ష్మణ్‌ కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా డా. లక్ష్మణ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి, మల్కాజిగిరి సర్కిల్‌లో బీజేపీని మరింత బలోపేతం చేయాలన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని నూతన కార్పొరేటర్‌కు సూచించారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు నర్సింహగౌడ్‌, ఆనంద్‌ గౌలికర్‌, డివిజన్‌ అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T06:59:56+05:30 IST