110 డివిజన్లలో 50%

ABN , First Publish Date - 2020-12-03T05:50:58+05:30 IST

గత గ్రేటర్‌ ఎన్నికలతో పోలిస్తే సగటు ఓటింగ్‌ శాతం కొంత పెరిగినా, పలు డివిజన్లలో అత్యల్పంగా నమోదైంది.

110 డివిజన్లలో 50%

48 డివిజన్లలో సగటు కంటే తక్కువ 

8 39 డివిజన్లలో 55 శాతం దాటిన పోలింగ్‌  8 మూడో చోట్ల 60 శాతానికి పైగా..

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): గత గ్రేటర్‌ ఎన్నికలతో పోలిస్తే సగటు ఓటింగ్‌ శాతం కొంత పెరిగినా, పలు డివిజన్లలో అత్యల్పంగా నమోదైంది. మొత్తం పోలింగ్‌ శాతం 46.55 కాగా, 48 డివిజన్లలో 45 శాతంలోపు పోలింగ్‌ నమోదైంది.  33 శాతం వార్డుల్లో సగటు కంటే తక్కువ పోలింగ్‌ నమోదైంది. ఆయా వార్డుల్లో 32 నుంచి 44 శాతం వరకే పోలింగ్‌ నమోదైంది. 110 డివిజన్లలో 50శాతం ఓట్లు పోలయ్యాయి. కొన్నిచోట్ల 55 నుంచి 65 శాతం వరకు నమోదైంది.  అత్యల్పంగా యూస్‌ఫగూడలో 32.99 శాతం అత్యల్ప పోలింగ్‌ నమోదైంది. మెహిదీపట్నంలో 34.41తో రెండో అత్యల్ప పోలింగ్‌ శాతంగా నమోదైంది. 40 శాతం లోపు పోలింగ్‌  14 డివిజన్లలో నమోదు కాగా, 32 డివిజన్లలో 45 శాతం లోపు పోలింగ్‌ నమోదు అయింది. 50 శాతం లోపు పోలింగ్‌ 62 డివిజన్లలో నమోదైంది. 34 డివిజన్లలో 55 శాతం లోపు పోలింగ్‌ నమోదైంది. రెండు డివిజన్లలో 60 శాతం లోపు, మూడు డివిజన్లలో 65 శాతానికి పైగా పోలింగ్‌ నమోదయినట్లు అధికారులు ప్రకటించిన లెక్కలు చెబుతున్నాయి.  

గ్రేటర్‌ శివారులోని రామచంద్రాపురంలో 67.71 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇదే గ్రేటర్‌లో అత్యధిక పోలింగ్‌ జరిగిన డివిజన్‌. పటాన్‌చెరువు  65.77 పోలింగ్‌తో రెండో స్థానంలో, 61.89 శాతంతో భారతీనగర్‌ డివిజన్లు మూడోస్థానంలో నిలిచాయి. 

35 శాతం లోపు పోలింగ్‌ 

-  యూసు్‌ఫగూడ - 32.99,  

మెహిదీపట్నం - 34.41

40 శాతంలోపు పోలింగ్‌ (14) - సరూర్‌నగర్‌ -38.18, సైదాబాద్‌ -38.18, మూసారంబాగ్‌ - 37.43, అక్బర్‌బాగ్‌ - 39.43, సంతో్‌షనగర్‌ - 35.93, విజయ్‌నగర్‌కాలనీ-37.90, అమీర్‌పేట్‌-38.02, సనత్‌నగర్‌ -39.98, మాదాపూర్‌ -38.64, మియాపూర్‌-36.25, హహీజ్‌పేట్‌ - 38.31, చందానగర్‌-39.40, హైదర్‌నగర్‌-37.32, అల్విన్‌కాలనీ-39.50

45 శాతం పోలైన డివిజన్లు 32

50 శాతం లోపు డివిజన్లు - 62

55 శాతం లోపు  డివిజన్లు - 34

60 శాతం లోపు డివిజన్లు 2 

- నవాబ్‌సాహెబ్‌కుంట - 55.65, 

గాజుల రామారం - 58.61

65 శాతం లోపు డివిజన్లు 3 -  

   భారతీనగర్‌ - 61.89, పటాన్‌చెరు - 65.77, 

రామచంద్రాపురం - 67.71


ఏమవుతుందో..


జీడిమెట్ల, డిసెంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): అభ్యర్థులు గెలుపోటముల లెక్కలు వేసుకుంటున్నారు. కొందరు భారీగా డబ్బు ఖర్చు పెట్టాం.. గెలుస్తామా.. లేదా అన్న ఆందోళనలో ఉన్నారు. సిట్టింగ్‌లుగా ఓడిపోతే తమ పరిస్థితి ఏమిటని ఆలోచనలో పడ్డారు. మొత్తంగా పోలింగ్‌ ముగిసిన తర్వాత అభ్యర్థులు, కాలనీలు.. బస్తీల్లో తమకు పోలయ్యే ఓట్ల లెక్కింపులో మునిగితేలుతున్నారు. 

Updated Date - 2020-12-03T05:50:58+05:30 IST