కిషన్‌రెడ్డి రోడ్‌ షోలో జనాల కంటే పోలీసులే ఎక్కువ..!

ABN , First Publish Date - 2020-11-26T16:52:06+05:30 IST

సీతారాంబాగ్‌ ఫ్రెండ్స్‌ కేఫ్‌ నుంచి ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన రోడ్‌ షో జనాలు లేకపోవడంతో 11 తర్వాత మొదలైంది. మల్లేపల్లి బీజేపీ అభ్యర్థి కొల్లూరు ఉషా తరఫున సుమారు 20 మందితో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి రోడ్‌ షో ప్రారంభమైంది. కోమట్‌ కుంట, కట్టమైసమ్మ మీదుగా ఆగాపురా,

కిషన్‌రెడ్డి రోడ్‌ షోలో జనాల కంటే పోలీసులే ఎక్కువ..!

మంగళ్‌హాట్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): సీతారాంబాగ్‌ ఫ్రెండ్స్‌ కేఫ్‌ నుంచి ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన రోడ్‌ షో జనాలు లేకపోవడంతో 11 తర్వాత మొదలైంది. మల్లేపల్లి బీజేపీ అభ్యర్థి కొల్లూరు ఉషా తరఫున సుమారు 20 మందితో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి రోడ్‌ షో ప్రారంభమైంది. కోమట్‌ కుంట, కట్టమైసమ్మ మీదుగా ఆగాపురా, అనంతరం అఫ్జల్‌ సాగర్‌, మల్లేపల్లి మసీదు, జెడ్‌కేఫ్‌, సీతారాంబాగ్‌, ఓల్డ్‌ మల్లేపల్లి, బైటక్‌ తదితర ప్రాంతాల్లో రోడ్‌ షో నిర్వహించారు. షో మొత్తంలో 45 ద్విచక్ర వాహనాలపై నాయకులు ఉంటే 100 మందికి పైగా పోలీసులు ఉండడం గమనార్హం. దీంతో ఫ్రెండ్స్‌ కేఫ్‌ వద్ద, బైటక్‌ ప్రాంతాల్లో కిషన్‌రెడ్డి మాట్లాడాల్సి ఉండగా నేరుగా ఆసి్‌ఫనగర్‌, గుడిమల్కాపూర్‌ వైపు వెళ్లిపోయారు. రోడ్‌ షోలో జనాల కంటే మంత్రి కాన్వాయే కనిపించడం గమనార్హం. 

Updated Date - 2020-11-26T16:52:06+05:30 IST